భారత్ బంద్ పోస్టర్ ఆవిష్కరణ!

402

రేణిగుంట, మార్చి 22 (న్యూస్‌టైమ్): నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 26న భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా రేణిగుంట సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక పాంచాలి నగర్‌లో బంద్‌కు సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగిందని సిఐటియు మండల కార్యదర్శి కె.హరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా హరినాథ్, తారకరామనగర్ సీనియర్ నాయకులు శివానందం మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ భారత బంద్ కు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు, కార్మికులు, ఉద్యోగులు, యువకులు కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. అదే విధంగా రేణిగుంట లోని వివిధ వ్యాపారస్తులు,వాహనదారులు, విద్యాసంస్థలు, ప్రజలు, ఈ బంద్ విజయవంతం కోసం స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలి. వ్యవసాయ నల్ల చట్టాలు-విద్యుత్ బిల్లు 2020ను వెంటనే ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలి అవసరమైన ప్రజలకు ఆహార, ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా మార్చి 26న ఈ భారత్ బంద్ జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ.వెంకటరమణ, సత్య శ్రీ, ఈశ్వరి, హరినాథ్, శివానందం పాల్గొన్నారు.