తొలి ఏసీ త్రీటైర్ ఎకాన‌మీ క్లాస్ కోచ్ ఆవిష్క‌రణ

433

న్యూఢిల్లీ, మార్చి 21 (న్యూస్‌టైమ్): భారత రైల్వే ప్రొడక్షన్ యూనిట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తాలా ఇటీవల ఇండియన్ రైల్వే (ఐఆర్) తొలి లింకే హాఫ్మన్ బుష్ (ఎల్‌హెచ్‌బి) ఏసీ త్రీటైర్ ఎకానమీ క్లాస్ కోచ్ న‌మూనాను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ట్ర‌య‌ల్ విజ‌య‌వంతంగా పూర్తి అయింది. ఇది ఎల్‌హెచ్‌బి ఏసీ త్రీ టైర్ కోచ్ నూత‌న భిన్నర‌కం. ప్యాసెంజ‌ర్ డెక్‌పై న‌డ‌వ‌న‌వ‌స‌రం లేకుండా విద్యుత్ ప్యానెళ్ళు ఉంచ‌డం ద్వారా ప్యాసెంజ‌ర్ల ఉప‌యోగం కోసం అద‌న‌పు చోటు క‌ల్పించ‌డం ఈ కోచ్‌లో ప్రత్యేకత. సుమారు 83 బెర్త్‌ల మేర‌కు ప్యాసెంజ‌ర్ సామ‌ర్ధ్యం పెంచారు. దివ్యాంగుల‌కు చ‌క్రాల కుర్చీలను అందుబాటులో ఉంచ‌డంతో పాటు వారికి ప్ర‌త్యేక కంపార్ట్‌మెంటు, వారికి ప్ర‌త్యేక ద్వారంతో పాటుగా సుగ‌మ్య భార‌త్ అభియాన్ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి చ‌క్రాల కుర్చీ అందుబాటుతో దివ్యాంగుల‌కు అనుకూల‌మైన టాయిలెట్ల ఏర్పాటు చేశారు. అన్ని బెర్తుల‌కు వెంట్‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా ఏసీ సౌక‌ర్యాన్ని కల్పించారు. ప్ర‌యాణీకుల‌కు మ‌రింత సౌక‌ర్యాన్ని ఇవ్వ‌డం కోసం, త‌క్కువ బ‌రువు, అధిక నిర్వ‌హ‌ణ‌కు అవ‌కాశం ఉన్న సీట్లు, బెర్తుల నిర్మాణ న‌మూనా రూపకల్పన చేశారు. ప్ర‌యాణీకుల‌కు మెరుగైన సౌక‌ర్యాన్ని అందించేందుకు నిలువు, అడ్డం బెర్తుల‌కు మ‌డ‌వ‌గ‌ల స్నాక్ టేబుళ్ళ ఏర్పాటు, దెబ్బ‌లు త‌గిలే అవ‌కాశం లేని చోటు, మంచి నీటి బాటిళ్ళు, మొబైల్ ఫోన్లు, ప‌త్రిక‌లు పెట్టుకోవ‌డానికి హోల్డ‌ర్లను సమకూర్చారు. ప్ర‌తి బెర్తుకు చ‌దువుకోవ‌డానికి రీడింగ్ లైట్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటుచేయడంతో పాటు మ‌ధ్య‌, పై బెర్తుల‌ను ఎక్కేందుకు మెరుగు ప‌రిచిన, స‌మ‌ర్ద‌వంత‌మైన‌ నిచ్చెన న‌మూనా ఉంది. మ‌ధ్య‌, పై బెర్తుల‌పై కూర్చున్న‌ప్పుడు త‌ల పైన త‌గ‌ల‌కుండా అద‌న‌పు స్థ‌లం ఉంది. భార‌తీయ‌, ప‌శ్చిమ లావెట‌రీల మెరుగైన న‌మూనాతో పాటు స‌మ‌ర్థ‌వంత‌మైన‌, అంద‌మైన ద్వారం, ప్ర‌కాశించే సీటు గుర్తులు, ప్రకాశించే బెర్త్ సంఖ్యలతో, రాత్రి దీపాలతో సమగ్రమైన ప్రకాశవంతమైన బెర్త్ సూచికలను ఏర్పాటుచేశారు. సామాగ్రికి సంబంధించి ప్ర‌పంచ స్థాయి బెంచ్ మార్కుకు అనుగుణంగా మెరుగైన అగ్ని మాప‌క ప్రమాణాలు ఏర్పాటుచేయడం మరో ప్రత్యేకతగా పేర్కొనవచ్చు. అవ‌స‌ర‌మైన అనుమ‌తులు వ‌చ్చిన త‌ర్వాత ఎల్‌హెచ్‌బి కోచ్‌ల‌తో న‌డిచే (రాజ‌ధాని, శ‌తాబ్ది, దురంతో వంటి ప్ర‌త్యేక ర‌కం రైళ్ళు మిన‌హా) అన్ని మెయిల్‌, ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో ఎల్‌హెచ్‌బి ఎకాన‌మీ క్లాస్ కోచ్‌ల‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు.