టీటీడీ చైర్మన్ పై “బురద” చల్లే కుట్ర!

548

టీటీడీ చైర్మన్ ను సాగనంపేందుకు,300 కోట్ల “ఉద్వేగ్” ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముంబై కంపెనీ 300 పడకల ఆసుపత్రి 10 ఎకరాల స్థలం భారీ కుంభకోణం, లోపాయికారి ఒప్పందం వ్యవహారం నుంచి “భక్తుల దృష్టిని” మళ్లించేందుకు “భారీ స్కెచ్” !!  టిటిడి చైర్మన్ వెంట అభిషేకం ఏకాంత సేవలో బయట వారు ఎలా వెళ్తారు అంటూ మీడియాకు లీక్ “ఇంటి దొంగల” పనే!

టిటిడి చైర్మన్ వెంట వెళ్లిన వ్యక్తుల విషయం టిటిడి ఉన్నతాధికారులే బయటపెట్టారు వారికి తప్ప ఇతరులకు తెలిసే అవకాశమే లేదు! తిరుమలలోని కొంతమంది ఇంటి దొంగల వ్యవహారంపై “టీటీడీ విజిలెన్స్,ప్రభుత్వ నిఘా సంస్థల ద్వారా విచారణకు” టిటిడి చైర్మన్ ఆదేశించాలి!
టీటీడీ నిబంధనల ప్రకారం టీటీడీ ఈవో,చైర్మన్ కుటుంబ సభ్యులు మాత్రమే ప్రతి శుక్రవారం అభిషేకం టికెట్టు లేకుండా పాల్గొనవచ్చు ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఈవో చైర్మన్ కుటుంబ సభ్యులు కాకుండా కరోనా లాక్ డౌన్ సమయంలో అర్హత లేని కొంతమంది కుటుంబ సమేతంగా టికెట్టు కొనుగోలు చేయకుండా శ్రీవారి అభిషేకం సేవలో ఎలా పాల్గొంటారు?

టిటిడి లోని కొంతమంది అధికారులు వారికి కావలసిన వారిని కరోనా లాక్ డౌన్ సమయంలో ఏకాంత సేవకు సైతం అనుమతించారన్న విమర్శలు వచ్చాయి టిటిడి ఈవో చైర్మన్ ఆదేశాలతో ఆలయంలోని “సీసీ కెమెరా ఫుటేజ్” లను టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి! టిటిడి చైర్మన్ మంచితనాన్ని సహనాన్ని కొంత మంది అవినీతి అధికారులు చేతగానితనంగా తీసుకొని మీడియాకు లీకులు ఇస్తున్నారన్నది టిటిడి ఉద్యోగస్తులలో స్థానికులలో జరుగుతున్న పెద్ద చర్చ!

టిటిడి చైర్మన్ వెంట ఇతర వ్యక్తులు ఏకాంత అభిషేక సేవలో పాల్గొన్న విషయాన్ని అంతర్గతంగా చర్చించి బహిర్గతం చేయకుండా అలాంటి తప్పిదాలు తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత “తిరుమల అధికారి” పై ఉంది!  శ్రీవారి సన్నిధిలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కొంతమంది అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తే మాత్రం వెంటనే కేసులు పెట్టే టీటీడీ మరి ధర్మకర్తల మండలి ఛైర్మన్ అంతర్గత వ్యవహారాలను బహిర్గతం చేస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటారు?  టిటిడి ప్రతిష్టను కాపాడాల్సిన అధికారులు ఆధిపత్య పోరులో ఉద్దేశపూర్వకంగా ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా టీటీడీ చైర్మన్ వ్యవహరిస్తున్నారని లీకులు ఇవ్వడం “అధర్మం” కాదా గోవిందా?

– నవీన్ కుమార్ రెడ్డి