ఐఏఎస్ ,ఐపీఎస్ ల పై అనుచిత వాక్యాలకు ఖండన

396

కేతిరెడ్డి , సంజయ్ లపై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

ఖమ్మం  ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని బహుజన జే. ఏ. సీ. డిమాండ్ చేసింది. శనివారం సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ ఛైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అనంతపూర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అదేవిధంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను కూడా అంతే తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.ఇరువురి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని, దానితోపాటు ఇరువురిని ఆయా పార్టీలు బర్త ర ఫ్ చేయా లని  కోరారు .లేనిపక్షంలో బహుజన జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ,హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంతేటి వీరభద్రం ,లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతూ బద్రునాయక్ , మైనార్టీ సంఘం నాయకు రాలు షేక్ నజీమా, మాలమహానాడు జిల్లా కార్యదర్శిదార సంజీవరావు విద్యావంతుల వేదిక నాయకులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.