ప్ర‌తిఘాతుక‌త్వ శ‌క్తి క‌లిగిన మౌలిక స‌దుపాయాలు

0
539

న్యూఢిల్లీ, మార్చి 19 (న్యూస్‌టైమ్): ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇంట‌ర్‌నేషన‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆన్ డిజాస్ట‌ర్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ తాలూకు ఆరంభిక కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫిజీ ప్ర‌ధాని, ఇట‌లీ ప్ర‌ధాని, యునైటెడ్ కింగ్‌డ‌మ్ ప్ర‌ధాని పాలుపంచుకొన్నారు. ఈ స‌మావేశంలో జాతీయ ప్ర‌భుత్వాల ప్ర‌తినిధులు, అంత‌ర్జాతీయ సంస్థల‌కు చెందిన నిపుణులు, విద్యా సంస్థ‌లు, ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులు కూడా పాల్గొన్నారు. ప్ర‌స్తుతం ఉన్న‌టువంటి ఈ స్థితి ని ఇదివ‌ర‌కు ఎన్న‌డూ ఎరుగ‌ము అని ప్ర‌ధాని అన్నారు.

‘‘మ‌నం వంద సంవ‌త్స‌రాల కాలంలో ఒక‌సారి ఎదురుప‌డే విప‌త్తు అని వ్య‌వ‌హ‌రిస్తున్న ఘ‌ట‌న‌ను చూస్తున్నాము. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి మ‌న‌కు ప‌ర‌స్ప‌ర సంధానం క‌లిగిన‌టువంటి, ప‌ర‌స్ప‌రం ఆధార‌ప‌డిన‌టువంటి, ప్రపంచంలో అది ధ‌నిక దేశ‌మా లేదా పేద దేశ‌మా, అది తూర్పు దిక్కున ఉన్న దేశ‌మా లేదా ప‌శ్చిమ దిక్కున ఉన్న దేశ‌మా, ఉత్తర దిక్కున ఉన్న దేశ‌మా లేదా ద‌క్షిణ దిక్కున ఉన్న దేశ‌మా అనే అంశంతో సంబంధం లేకుండా ప్ర‌పంచ విప‌త్తుల ప్ర‌భావం బారిన ప‌డ‌న‌టువంటి దేశం ఏదీ లేద‌ని నేర్పింది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్ర‌పంచం ఏ ర‌కంగా ఒక్క తాటి మీద నిల‌బ‌డ‌గ‌లుగుతుంద‌నేది మ‌హ‌మ్మారి చాటింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘ప్ర‌పంచ స‌వాళ్ళ‌ ను ప‌రిష్క‌రించ‌గ‌లిగే నూత‌న ఆవిష్క‌ర‌ణ ఎక్క‌డ నుంచి అయినా రాగ‌ల‌దు అని మ‌హ‌మ్మారి తెలియ‌జేసింది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ విష‌యంలో న‌రేంద్ర మోదీ ప్ర‌పంచంలో అన్ని ప్రాంతాలలో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను స‌మ‌ర్ధించేట‌టువంటి ఒక గ్లోబ‌ల్ ఇకో సిస్ట‌మ్‌ను పెంచి పోషించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని, దానిని అత్య‌వ‌స‌ర‌మైన ప్రాంతాలకు బ‌ద‌లాయించాల‌ని పిలుపునిచ్చారు. 2021వ సంవ‌త్స‌రం మ‌హ‌మ్మారి బారి నుంచి త్వ‌రిత‌గ‌తిన కోలుకొనే సంవ‌త్స‌రంగా ఆశను రేకెత్తిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. మ‌హ‌మ్మారి నుంచి నేర్చుకొన్న పాఠాలను మ‌ర‌చిపోకూడ‌ద‌ని ప్ర‌ధాన ‌మంత్రి జాగ్ర‌త్త చెప్పారు. అవి కేవ‌లం ప్ర‌జారోగ్య విప‌త్తులకు మాత్ర‌మే వ‌ర్తించ‌బోవ‌ని, ఇత‌ర విప‌త్తుల విష‌యంలోను అవి వ‌ర్తిస్తాయ‌ని ఆయ‌న అన్నారు.

జ‌ల వాయు ప‌రివ‌ర్త‌న ప్ర‌భావాన్ని త‌గ్గించే దిశలో నిల‌క‌డ‌త‌నంతో కూడిన‌టువంటి ఉమ్మ‌డి కృషి ఎంతైనా అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెడుతున్న‌టువంటి భార‌త‌దేశాన్ని పోలిన దేశాలు ఇది రిస్కు ప‌రంగా పెడుతున్న పెట్టుబ‌డి కాద‌ని, విప‌త్క‌ర స్థితికి ఎదురొడ్డి నిల‌వ‌డంపై పెడుతున్న‌టువంటి పెట్టుబ‌డి అనే సంగ‌తిని ఖాయ‌ప‌ర‌చుకోవాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. డిజిట‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, షిప్పింగ్ లైన్స్‌, విమాన‌యాన సంబంధిత నెట్‌వ‌ర్క్‌లు వంటి అనేక మౌలిక స‌దుపాయ సంబంధిత వ్య‌వ‌స్థ‌లు యావ‌త్తు ప్ర‌పంచంతో సంబంధం క‌లిగి ఉన్న‌వి అని, ప్ర‌పంచంలోని ఒక భాగంలో దాపురించే విప‌త్తు తాలూకు ప్ర‌భావం ప్ర‌పంచం మొత్తానికి చాలా శీఘ్రంగా వ్యాప్తి చెందే ఆస్కారం ఉంద‌ని ఆయ‌న అన్నారు. గ్లోబ‌ల్ సిస్ట‌మ్ తాలూకు ప్ర‌తిఘాతుక‌త్వానికి పూచీ ప‌డాలి అంటే, అందుకు స‌హ‌కారం అనేది అత్యంత అవ‌స‌ర‌మ‌ని చెప్పారు.

‘‘ప్ర‌పంచంలోని ద‌క్షిణ ప్రాంతాలలో నెల‌కొన్న స‌హ‌కార పూర్వ‌క యంత్రాంగం అయిన‌టువంటి సిడిఆర్ఐ ఈ అజెండాను ముందుకు తీసుకుపోవ‌డానికి ఒక సముచిత‌మైన వేదికను అందిస్తోంది. మౌలిక స‌దుపాయాల‌ను దీర్ఘ‌కాల ప్రాతిప‌దికతో అభివృద్ధిప‌ర‌చ‌డం జ‌రుగుతోంద‌ని’’ అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. 2021వ సంవ‌త్స‌రం ప్ర‌ధానంగా ముఖ్య‌మైన సంవ‌త్స‌రంగా నిలుస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘‘మనం సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాలు, ప్యారిస్ ఒప్పందం, సెండ‌యీ ఫ్రేమ్ వ‌ర్క్‌ల మ‌ధ్య బిందువు వ‌ద్ద‌కు చేరుకొంటున్నాం, ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్థంలో ఇట‌లీ, యుకెలు ఆతిథ్యం ఇవ్వ‌బోయేట‌టువంటి సిఒపి-26 పైన ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్నాం. ప్ర‌తిఘాతుక‌త్వ శ‌క్తి క‌లిగిన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న తాలూకు ఈ భాగ‌స్వామ్యం ఆ ఆశ‌లలో కొన్నింటినైనా నెర‌వేర్చుకోవ‌డంలో ఒక ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించ‌వ‌ల‌సి ఉన్న‌ది’’ అని ఆయ‌న అన్నారు.

కీల‌క ప్రాధాన్యాన్ని ఇవ్వ‌వ‌ల‌సిన‌టువంటి రంగాలు ఏమేమిట‌న్న‌ది ప్ర‌ధాన మంత్రి విడ‌మ‌ర‌చి చెప్పారు. ‘‘ఒక‌టోది ఏమిటంటే, సిడిఆర్ఐ అనేది సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల తాలూకు ప్ర‌ధాన వాగ్ధానాన్ని త‌న‌లో ఇముడ్చుకోవాలి. ఏ ఒక్క దేశాన్ని వెనుక‌ప‌ట్టున వ‌ద‌లి వేయ‌కూడ‌దు అనేదే ప్ర‌ధాన‌మైన‌టువంటి వాగ్ధానంగా ఉంది. దీనికి అర్థం మ‌నం అత్యంత దుర్భ‌ల‌మైన‌టువంటి దేశాల, స‌ముదాయాల ఆందోళ‌న‌లకు ప్రాముఖ్యం ఇవ్వాలి అనేదే. రెండ‌వ రంగం ఏమిటంటే, మ‌నం కొన్ని కీల‌క మౌలిక స‌దుపాయాల రంగాల ప‌నితీరును ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ఉండాలి. మ‌రీ ముఖ్యంగా ఆరోగ్య రంగ మౌలిక స‌దుపాయాలు, డిజిట‌ల్ ప‌ర‌మైన మౌలిక స‌దుపాయాల రంగాల‌ను గురించి శ్ర‌ద్ధ తీసుకోవాలి. మ‌హ‌మ్మారి కాలంలో ముఖ్య పాత్ర పోషించింది ఈ రంగాలే. ఈ రంగాల నుంచి నేర్చుకొనేట‌టువంటి పాఠాలు ఏమిటి? వాటిని భ‌విష్య‌త్తులో మ‌రింత ప్ర‌తిఘాతుక‌త్వం క‌లిగిన‌విగా మ‌నం ఎలా తీర్చిదిద్ద‌గ‌లుగుతాము? మూడో రంగం ఏమిటి అంటే, ప్ర‌తిఘాతుక‌త్వం కోసం మ‌నం సాగిస్తున్న అన్వేష‌ణలో ఎటువంటి సాంకేతిక విజ్ఞాన సంబంధిత వ్య‌వ‌స్థ‌లు అయినా స‌రే, అది మ‌రీ ప్రాథ‌మికంగా ఉంద‌నో, లేదా బాగా ఎక్కువ‌గా అభివృద్ధి చెందింది అనో భావించ‌రాదు అనేదే. సిడిఆర్ఐ సాంకేతిక విజ్ఞానం తాలూకు ఆచ‌ర‌ణ కార్యాక‌ర‌ణ ప్ర‌భావాన్ని వీలైనంత అధికంగా వినియోగంలోకి తీసుకురావాలి. ఇక అంతిమంగా చూసిన‌ప్పుడు రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అనే భావ‌న ఒక సామూహిక ఉద్య‌మంగా రూపొంది, నిపుణులు లాంఛ‌నప్రాయ సంస్థ‌ల శ‌క్తులను మాత్ర‌మే బలపరచడం అనే అంశానికి పరిమితం కాకూడదు.’’ అని సూచిస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.