మల్లన్న హుండీ లెక్కింపులో 4.90 కోట్లు

403

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు భక్తులు వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తారు.  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ.4,90,10,126/-లు నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 16 రోజులలో సమర్పించినట్లు ఈఓ కె.ఎస్.రామారావు ఓ ప్రకటన లో తెలిపారు. అందులో ఇదే మొట్ట మొదటి సారిగా హుండీ ఆదాయం లభించినట్లు తెలిపారు. అలాగే 21 USA డాలర్లు, 50 ఇంగ్లాండ్ పౌండ్స్,  5 సౌదీ రియల్స్, 5 యూరోస్, 2 సింగపూర్ డాలర్లతో పాటు పలు విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభించాయి.  అక్కమహాదేవి అలంకార మండపములో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.