బాబు చిత్ర విచిత్ర విలక్షణ విన్యాసాలు

889

ఏరువాక కార్యక్రమంలో పొడి నేలలో వరి నాట్లు వేసి, రాష్ట్ర ప్రజలకు నూతన  వరి నాట్లు వేసే  విధానం  నేర్పిన తీరుకు రాష్ట్రంలోని వ్యవసాయ శాస్త్ర వేత్తలు, రైతు సోదరులు దిమ్మ తిరిగి సొమ్మసిల్లి మూర్చ పోయే పరిస్థితి ఏర్పడింది.
చంద్ర బాబు  తానా అంటే తందానా అంటూ బృంద గానం చేసిన భజన పరులు, ఇలాంటి వాటిని కెమేరా లో బన్దించి నిసిగ్గుగా ప్రచారం చేసిన బాకా బృందాలు, భజనను భక్తిగా భావించి తరించిన చంద్ర బాబు లాంటి పాలకులు తుగ్లక్ ను మైమరపించిన పాలనను ఈతరం వారికి అందించారు అంటే అతి శ యోక్తీ కాదు.
చంద్ర బాబు ముఖ్య మంత్రిగా ఉంటే వర్షాలు పడవు… ఎప్పుడూ కరువే… ఇలాంటి తిక్కవేషాలు వేసి  రైతులను అమాయకులుగా భావించి, రైతులపై కపట ప్రేమ వొలక బోసి మానవాతీత శక్తీ లా కరువును జయించాను, సముద్రాన్ని కంట్రోల్ చేశాను, తుఫాన్ను దారి మల్లించాను అని, మాట్లాడితే దేశ రికార్డులు ప్రపంచ రికార్డులు నావేనని సొంత డబ్బాలు కొట్టు కుంటూ ప్రజలను  మోసంచేస్థూ  ప్రచారాలు చేసిన చంద్ర బాబు పాలనలో కరువు రాక ఏమి వస్తుంది…
చంద్ర బాబు ముఠా చేసిన ఇలాంటి వికృత విన్యాసాలు భరించి భారంగా బ్రతుకు ఈడ్చిన ప్రజలు… కనీసం ప్రతి పక్షనాయకునిగా నైనా ఏమాత్రం భాధ్యతా యుతంగా వ్యవహరించ కుండా భాషలో దిగజారి, భావజాలంలో దిగజారి, నాయకత్వ లక్షణాలలో దిగజారి అద్వితీయ ప్రజాభిమానంతో ముఖ్య మంత్రి అయిన వ్యక్తినీ, చివరికి రాష్ట్ర ప్రజలను కూడా విన లేని భాషలో తిడుతూ, నేడు పిఛ్హికి పరాకాష్టగా తన పచ్చ ముఠాతో వోటర్లను వాడ కూడని పద జాలంతో తిట్టిస్థూ  ఉన్న వ్యక్తీని నేడు ప్రజలు ఏరకంగా భావించాలి ?… ఈతరం నాయకుని గానా ?…ఈతరం తుగ్లక్ గానా ?…

– యం వీ యస్ నాగిరెడ్డి