‘సిల్లీ కేసులతో వెంట్రుక కూడా పీకలేరు’

273

హైదరాబాద్, మార్చి 16 (న్యూస్‌టైమ్): తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి జగన్ రెడ్డి పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుందని, అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు? పాడతారో అర్ధంకావడం లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ‘‘21 నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు. సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు. అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనని తానే కాపాడుకుంటుంది.’’ అని అన్నారు.