కిషన్ రెడ్డి గారూ.. భైంసా బాధితురాలిని పరామర్శించరేం?

604

ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు యావత్ తెలంగాణ హిందూ ప్రజల అభిప్రాయం. ఆలోచన. మొన్న జరిగిన భైంసా అల్లర్లలో హిందూ వర్గానికి చెందిన కొంతమంది జర్నలిస్టులు మరియు పౌరులు, మతోన్మాదుల చేతులో గాయపడ్డ విషయం అందరికి తెలిసిందే. మరునాడు హిందూ చిన్నారిపై ముస్లిం వర్గానికి చెందిన యువకులు అత్యాచారం చేస్తే,  ఇప్పటివరకు లెఫ్టిస్టు భావాలు గల కాంగ్రెసు- సిపిఎం- సిపిఐ..  ఓ అని మొత్తుకునే మహిళా సంఘాలు గాని, అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ  ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా నోరు విప్పడం లేదు ఎందుకు?

ట్విట్టర్ సోషల్ మీడియాలో బిజీగా ఉండే కేటీఆర్ కు జన్మదిన కార్యక్రమాలు తెలుప వస్తుంది. కానీ ఐదు సంవత్సరాల చిన్నారి అత్యాచారానికి గురై .. గాంధీ హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య  కొట్టుమిట్టాడుతుంటే, అక్కడికి వెళ్లి పరామర్శించడం చాతగాని అధికార పార్టీ మంత్రి  మరియు వారి యంత్రాంగం! హిందువులకు పెద్ద దిక్కు అయిన  ఒక బిజెపి తప్ప మిగతా ఏ పార్టీ కూడా స్పందించడం లేదు హిందువులారా ఆలోచించండి.

మరి కేంద్ర హోంమంత్రిగా తెలంగాణ నుండి కిషన్ రెడ్డి  ఉండి ఏం లాభం సారు? మీ పక్క జిల్లాలోనే  ఇన్నిసార్లు హిందువులపై దారుణాలు దాడులు, లూటీలు జరుగుతుంటే,  భైంసా బాధితుల దగ్గరికి వెళ్లి ఏం జరిగిందో పట్టించుకోకుండా ఏం చేస్తున్నట్టు?

హైదరాబాద్ నగరంలోనే ఉండి కేవలం ప్రెస్ మీట్ లకే పరిమితమై,  ఢిల్లీకి వెళ్లి పోతే ఎట్లా సారు? మరి ఇక్కడ ప్రజలు కనిపించడం లేదా? ఇది బాధాకరం కిషన్ రెడ్డి గారు.మీరు కేంద్ర మంత్రా? లేక సాధారణ ఎమ్మెల్యేనా? మీ పరిథి అంబర్ పేట నియోజకవర్గమే కాదు. యావత్ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకోవాలి.

మీ కంటే చిన్నోడు .. నిన్న మొన్న పార్టీలోకి వచ్చి నోడు..  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్,  బైంసాకువెళ్లి బాధితులకు భరోసా ఇవ్వడానికి బయలుదేరడానికి సిద్ధంగా వుంటే,మరి  మీరేం చేస్తున్నట్లు?కిషన్ రెడ్డి గారు!

–  పెంజర్ల మహేందర్ రెడ్డి
                                                                                         ఓసీ సంఘం
                                                                                      జాతీయ అధ్యక్షుడు