డీగ్రీ కోర్సులు మూసివేత నిర్ణయం మానుకోవాలి

0
812

– నాగోతు రమేష్ నాయుడు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 30 శాతం కంటే తక్కువగా అడ్మిషన్లు ఉన్న కోర్సులు మూసి వేస్తున్నారు.దీని వలన MPC, BZC, BA కోర్సులు మూతపడి పోతున్నాయి. 3 విడతల్లో ఆన్లైన్ అడ్మిషన్లు పూర్తి చేసుకొని,3 నెలలు చదివి, ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల ఒత్తిడి మేరకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని విద్యావేత్తల  అనుమానం అని బిజెపి రాష్ట్ర కార్యదర్శి  నాగోతు రమేష్ నాయుడు   వ్యాఖ్యానించారు.

MPC తెలుగు మీడియం కడప జిల్లాలో ఎక్కడా ప్రభుత్వ కళాశాలలలో లేదు. ఈ నిర్ణయం వలన MPC ( EM ), BA కోర్సులుకూడా  పూర్తిగా మూతపడి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సివిల్స్,  SSC, IBPS, గ్రూప్-1,2,3 లాంటి సర్వీస్ కమిషన్ EXAMS  తరువాత టీచర్, లెక్చరర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకున్న విద్యార్థుల ఆశలకు గండి కొట్టినట్లైంది. కంప్యూటర్స్ కోర్సులు తప్ప మిగతా కోర్సులు భవిష్యత్ లో ఎక్కడా కనిపించదు  అన్నారు.

UGC నిబంధనలు ప్రకారం రూరల్ లో 20 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు, అర్బన్ లో 25 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు  ఆ కోర్సులు ఆ సంవత్సరంకి మాత్రమే మూసివేయవచ్చు. తర్వాత సంవత్సరం అడ్మిషన్లు పెరిగితే  ఆ గ్రూపును కొనసాగించ వచ్చు.  3 విడతలు కౌన్సెలింగ్ జరిగిన తర్వాత 3 నెలలు పాటు క్లాసులు జరిగిన తర్వాత  సగం  సిలబస్ పూర్తయిన తరువాత అర్దాంతరంగా ఇలా 30 శాతం అడ్మిషన్లు లేకుంటే గ్రూపులు మూసేయవచ్చు అనే నిబంధనను తీసుకురావడం  బాధాకరం
( ఇంటికి ఆహ్వానించి , కూర్చోబెట్టి , అన్నం వడ్డించి అన్నం తినేటప్పుడు తీరా ఈ సమయంలో కాదు తినేది అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం) అన్నారు. ఒక్క కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు  MPC TM చదవాలి అంటే 200 నుండి 300 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని నాగోతు ఆవేదన వ్యక్తం చేశారు.