ఉక్కు సత్యాగ్రహ యాత్రకు హనుమాన్ జంక్షన్ లో ఘనస్వాగతం..

445

గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్టు తోట సురేష్ బాబు విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న”ఉప్పు సత్యాగ్రహ యాత్ర”ఈరోజు ఉదయం హనుమాన్ జంక్షన్ చేరుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు ఆధ్వర్యంలో  ఘన స్వాగతం పలికి,ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు  హనుమాన్ జంక్షన్ లోని లైన్స్ క్లబ్ కల్యాణ మండపంలో క్లబ్ అధ్యక్షులు బోయపాటి పూర్ణచంద్ర రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

మండల  సిపిఎం కార్యదర్శి బేత  శ్రీనివాసరావు మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించిన విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని, ఆంధ్ర ప్రదేశ్ దేశ్ లోనే 32 వేలమంది పనిచేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కు మణిహారం అని , దీని పరిరక్షణకు పార్టీలకతీతంగా పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని కోరారు. రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ వార్షిక టర్నోవర్ 20 వేల కోట్లు అని అందులో ఐదు వేల కోట్లు కేవలం ఇనుప ఖనిజ నిక్షేపాలు ఖర్చు చేస్తున్నారని, కేంద్రానికి విశాఖ ప్లాంట్ పై నిజమైన ప్రేమ ఉంటే సొంత గనులు కేటాయించి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ వార్షిక టర్నోవర్ 20 వేల కోట్లు అని అందులో ఐదు వేల కోట్లు కేవలం ఇనుప ఖనిజ నిక్షేపాలు ఖర్చు చేస్తున్నారని కేంద్రానికి విశాఖ ప్లాంట్ పై నిజమైన ప్రేమ ఉంటే సొంత నిధులు కేటాయించి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గత డిసెంబర్లో స్టీల్ ప్లాంట్ 2200 కోట్ల విలువైన ఉత్పత్తులు విక్రయించగా 200 కోట్ల నికర లాభం వచ్చిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్టీల్‌ప్లాంట్ పన్నుల రూపంలో ఎప్పటి వరకు 44 వేల కోట్లు చెల్లించి ఉందని కేవలం 20 వేల ఎకరాల భూమి, రెండు లక్షల కోట్ల నికర ఆస్తి ని ప్రవేట్ కంపెనీలకు దారాదత్తం చేసే కుట్రలో భాగమే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అని దీనిని వ్యతిరేకిస్తూ గుంటూరు నుంచి ఐదు జిల్లాల్లో 500 కిలోమీటర్ల సత్యాగ్రహ పాద యాత్ర చేస్తున్న తోట సురేష్ బాబు కు అభినందనలు తెలిపారు.
ఉక్కు సత్యాగ్రహ యాత్రకు శ్రీకారం చుట్టిన సామాజికవేత్త  తోట సురేష్ బాబు మాట్లాడుతూ సర్వం ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వ విధానంగా మారిందని, ప్రైవేటీకరణ అంటే దేశ సంపదను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, స్వదేశీ.. ఓకల్ ఫర్ లోకల్.. మేక్ ఇన్ ఇండియా వంటి ముద్దు మాటలు ఆచరణలో హుష్ కాకి అయిపోయాయి అని, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని అమ్మేస్తున్నారు అని నేడు కొంతమంది కేంద్రంలోని పెద్దలు వాది ఇస్తున్నారని అత్యంత లాభాల్లో ఉన్న ఎల్ ఐ సి ని ఎందుకు ప్రవేటీకరణ  చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కేవలం బడా పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టడానికి ఉపయోగ పడుతుంది అన్నారు.

ఇదే కార్యక్రమంలో తోట సురేష్ బాబు ను లైన్స్ క్లబ్, ఉక్కు పోరాట వేదిక సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సీనియర్ నాయకులు లింగనేని రాజారావు, అక్కినేని శ్రీనివాస ఫణీంద్ర, హనుమాన్ జంక్షన్ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు దయాల రాజేశ్వరరావు, అబ్దుల్ బారీ, మూల్పూరి సాయి కళ్యాణి, అట్లూరి శ్రీనివాస్, గండేపూడి నితీష్, కాండ్రు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జంక్షన్ నుండి పశ్చిమగోదావరి జిల్లా కలపర్రు వరకు పాదయాత్ర చేసి విశాఖ ఉక్కు సత్యాగ్రహ యాత్రకు సంఘీభావం తెలియజేశారు.