బాబుకు ప్ర‌జ‌లు కొబ్బరి చిప్ప‌ను కానుక‌గా ఇచ్చారు

406

18న మేయ‌ర్ గా  వైసీపీ అభ్య‌ర్థి  ఎన్నిక‌
దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు…

ఢిల్లీ లీడ‌ర్ అయిన‌ చంద్ర‌బాబు విజ‌య‌వాడ  వ‌చ్చి గ‌ల్లీ గ‌ల్లీ  తిరిగి అబ‌ద్దాలు ప్ర‌చారం చేశారు… కాని ‌ విజ‌య‌వాడ ప్ర‌జ‌లు చంద్ర‌బాబును ఛీ పొమ్మంటు  కొబ్బరి చిప్పను కానుక ఇచ్చారని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు..

రాష్ట్రంలో వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలకు మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో వైస్సార్సీపీ నుంచి గెలిచిన అభ్యర్థులకు  అభినందనలు తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉంద‌ని, మునిసిపల్ ఎన్నికలలో వైయస్ఆర్ సీపీ  క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తుతుంద‌ని, వైసీపీ విజ‌యం కైవ‌సం చేసుకుంద‌న్నారు. ప్ర‌జ‌లు కార్పొరేషన్లు అన్నీ జగన్ కు గిఫ్ట్ గా ఇచ్చారన్నారు. సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి  20 నెలల పాలన చూసి ప్ర‌జ‌లు ఓట్లేసారన్నారు. చ‌రిత్ర‌లో  ఏ అధికార పార్టీకి ఇన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు రాలేదని గుర్తు చేశారు.  చంద్రబాబుకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు అన్నారు.

జగనన్నఅంద‌రికీ సంక్షేమం,అభివృద్ది అంటూ మంచి పాలన చూపించారు.. అందుకే ప్ర‌జ‌లు పట్టం కట్టారు అన్నారు. కొబ్బరి చిప్పల మంత్రి అన్నావు చంద్రబాబు.. అదే చిప్ప నీకిచ్చారు చంద్రబాబూ…తెలుగుదేశం అభ్య‌ర్థుల‌కు  డిపాజిట్లు దక్కలేదు అన్నారు. ఎంపి  కేశినేని నాని పనికిమాలిన నాని అన్నారు. జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక్క డివిజన్ కూడా గెలుపు రాలేదన్నారు. ఈ నెల‌18న సీఎం జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి అదేశాల‌తో జరిగే ఎన్నికలలో వైసీపీ మేయర్ అభ్యర్ధి ఎన్నుకోబడతారు అని ధీమా వ్య‌క్తం చేశారు. టీడీపీ కంచుకోటలు బద్దలు కొట్టాం అన్నారు.