కొత్త కౌన్సిలర్లకు ఎమ్మెల్యే అన్నా శుభాకాంక్షలు

492

గిద్దలూరు, మార్చి 15 (న్యూస్‌టైమ్): ఈ నెల 10వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిచిన సందర్భంగా వారిని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన నివాసంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతి కుటుంబ అవసరాలు తీర్చేలా ఉన్నందున, మంచి చేస్తున్న ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు పలికారని, తదనుగుణంగా నగర పంచాయతీని అభివృద్ధి పధంలో నడిపించేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. ఈ కార్యక్రమంలో గెలిచిన అభ్యర్ధులు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.