తిరుపతి ఉప ఎన్నికలో సత్తాచాటుతాం

463

పోషణ్‌ అభియాన్‌, వనబంధు, ఎఫ్‌పీఓల ప్రోత్సాహకానికి కృషి
– ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో పోరాటం
– త్వరలో దేవాలయాల పరిరక్షణకు రథయాత్ర
– భాజపా పదాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
మీడియాకు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవిఎన్‌ మాధవ్‌ వెల్లడి

తిరుపతి ఉప ఎన్నికలో సత్తాచాటుతామని, మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న పోషణ్‌ అభియాన్‌, వనబంధు, ఎఫ్‌పీఓలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలుజరిగే కృషి చేస్తామని, రానున్న ఎంపీటీసీ,జెడ్‌పీటీసీ ఎన్నికల్లో ఎప్పటిలాలే అధికారపార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని, దేవాలయాలపరిరక్షణకు త్వరలో రథయాత్ర చేపడతామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభా పక్షనేత పివిఎన్‌ మాధవ్‌ తెలిపారు. భారతీయజనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం శనివారం జరిగింది. భాజపా జాతీయ
కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునిల్‌ డియోధర్‌, జాతీయకార్యదర్శి సత్యకుమార్‌, పూర్వ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మోర్చాల అధ్యక్షులు, జిల్లా
అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మాధవ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.

స్ధానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు అధికార వైఎస్‌ఆర్‌సీపీ ప్రతిపక్షాల అభ్యర్థులపై ప్రోలోభాలు,బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులకు దిగింది. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో ఇదే పంధాను అనుసరిస్తుంది.

ఓటేయకుంటే పథకాలు లబ్దిని నిలిపివేస్తామని ఓటర్లను వాలంటీర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలతో వ్యూహాత్మకంగా బెదిరించారు. ఈ అరాచకాలు అడ్డుకుంటాం. నివేదిక రూపొందించి న్యాయపోరాటం చేస్తాం.రాబోయే తిరుపతి పార్లమెంటుఎన్నికల్లో జనసేనతో కలసి పోటీచేస్తాం. అందరికీ ఆమోదయోగ్యమైన
అభ్యర్ధిని ఎంపిక చేసి ప్రకటిస్తాం. అన్ని శక్తులొడ్డి పోరాడతాం.రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదుగుతాం. కేంద్రప్రభుత్వం తిరుపతికి అనేక ప్రాజెక్టులు ఇచ్చింది. గరుఢవారధి, ఐఐటి, ఐఎసర్‌,
విమానాశ్రయఅభివృద్ధి, అమృత్‌, స్మార్ట్‌సిటి వంటి పలు ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. ఈ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తాం. బూత్‌స్థాయిలో పనిచేసి ప్రజలకు చేరువచేస్తాం. పంచాయతీ ఎన్నికల్లో భాజపా మద్దతుతో గెలిచిన అభ్యర్థులను సన్మానిస్తాం.

మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ప్రధాన పథకాలను రాష్ట్రంలో ప్రజలకు చేరువ చేసేలా ఉద్యమరూపంలో కృషిచేస్తాం. అవి బాలికలు,గర్భిణీస్త్రీలలో పౌష్టికాహారలోపం సమస్యను నివారించేలా ప్రధాని మోదీ అమలుచేస్తున్న “పోషణ్‌ అభియాన్‌ ” పథకం, రెండోది సామాజిక అటవీ సంపదను
ప్రోత్సహించే “వనబంధు యోజన”, మూడోది ఫార్మర్‌ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ల(ఎఫ్‌పీఓ) స్ధాపన. ఈ మూడు కార్యక్రమలపై ప్రత్యేకదృష్టి పెడుతున్నాం. వనబంధు కార్యక్రమాన్ని ఎస్టీమోర్చా, ఎఫ్‌పీఓల
కార్యక్రమాలను కిసాన్‌ మోర్చా చేపడతాయి. అలాగే పార్టీ సంస్థాగత కార్యక్రమాలపై దృష్టి పెడతాం. జూన్‌ 17 నాటికి ప్రశిక్షణ కార్యక్రమాలు పూర్తిచేస్తాం. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తామే
ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారంచేసుకుంటోంది. దీనిపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం. దేవాయలయాల పరిరక్షణకు ముందే నిర్దేశించుకున్న కపిలతీర్ధం నుంచి రామతీర్ధం యాత్రను త్వరలో ప్రారంభిస్తాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జరిగే ప్రచారాల్లో వాస్తవం లేదు. పరిశ్రమ మూతపడదు.
ఉద్యోగాలు పోవు. ఉద్యోగులు అభద్రతాభావానికి గురికావద్దు. పరిశ్రమల బలోపేతం, విలువ, ఉత్పాదకత, ఉద్యోగిత పెంపుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది.ఇది బలవంతంగా జరిగే ప్రక్రియ కాదు. అందరికీ ఆమోదమోగ్యమైన రీతిలోనే కేంద్రం దీనిపై ముందుకు వెళ్తుంది. రాష్ట్రానికి, కేంద్రానికి, ఉద్యోగులకు
ఆదాయం తెచ్చేలా ముందుకెళ్తాం. ఎన్నో సంస్థలను రక్షించిన చరిత్ర భాజపాకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోర్టులను ప్రైవేటీకరిస్తుంది. కడప స్టీల్‌ ప్లాంటును ఎందుకు ప్రైవేటు సంస్తకు అప్పగించింది? దమ్ముంటే తెలంగాణ ప్రభుత్వమే అక్కడి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్తలను నడపాలి. మీడియా సమావేశంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్‌బాజి పాల్గొన్నారు.