ఎన్నికల నిబంధనలు ఉల్లఘించిన టీఆర్ఎస్..

524

నిద్రపోతున్న ఎన్నికల కమిషనర్
కేంద్ర ఎన్నికల సంఘం కల్వకుంట్ల ఎన్నికల సంఘం అయ్యిందా ?
హోమ్ మంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం
చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్..మీరు రాజ్యంగ పరిరక్షకులు కానీ కేసీఆర్ కి కాదు
చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ వెంటనే చర్యలు తీసుకోవాలి
  ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఆరోపణ

”తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల పరిణామ క్రమాన్ని చూస్తుంటే అసలు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ అనే వ్యక్తి వున్నాడా ? లేదా నిద్రపోతున్నాడా ? ” అని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ”ఏ బూత్ లదగ్గరికిపోయినా టీఆర్ఎస్ పార్టీ చెందిన వ్యక్తులు కండువాలు కప్పుకొని, గులాబి టోపీలు పెట్టుకొని , ఇష్టారాజ్యంగా పార్టీ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ నిద్రపోతున్నారా ? కేంద్ర ఎన్నికల సంఘం కల్వకుంట్ల ఎన్నికల సంఘం అయ్యిందా ? అని ప్రశ్నించారు దాసోజు.

”రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక హోం శాఖకు మంత్రిగా వున్న వ్యక్తి , కనీస ఇంగితం లేకుండా ఓటర్లని మభ్యపెట్టె ప్రయత్నం చేస్తూ.. నేను ఉదయం ఎనిమిది గంటలకే ఓటు వేశా, వాణీ దేవిగారికే ఓటు వేశా అని సాక్ష్యాత్ హోమ్ మంత్రి మహమూద్ అలీనే చెబుతూ వుంటే ఎంత దిగజారుడు తనంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి, ఓటర్లు ఎలా మభ్యపెడుతున్నారో అర్ధం అవుతుంది ” అని చెప్పుకొచ్చారు దాసోజు.

చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఒక ఐఏఎస్ అధికారి. మీరు రాజ్యంగ పరిరక్షకులు కానీ కేసీఆర్ కి కాదు అనే సంగతి గుర్తు చేసుకోవాలి.  హోమ్ మంత్రి మహమూద్ అలీ ఓటు ఏం చేస్తారో చెప్పాలి. ఆయన ఓటుని రద్దు చేస్తారా ? లేదా ?  హోమ్ మంత్రిగా వున్న వ్యక్తే ఇలాంటి మాటలు మాట్లాడటం దుర్మార్గం. హోమ్ మంత్రి తీరే ఇన్నికల తీరుకు అద్దం పడుతుంది. ఓటుకు రూ. 5వేల నుండి రూ. 10వేల వరకూ పంచుతున్నారు ముందే చెప్పాం.  కానీ దాన్ని ఆపలేదు.  ఇవాళ ఎన్నికల రోజున కుడా విచ్చల విడిగా డబ్బులు పంచుతున్నారు.టీఆరెస్ కండువాలు కప్పుకొని మరీ ప్రలోభ పెడుతున్నారు . ఒక హోమ్ మంత్రి ఎన్నికల నిబందనకు విరుద్దంగా ప్రకటనలు చేస్తూ ఓటర్లని మభ్యపెట్టడం శోచనీయం. దిన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ వెంటనే చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు దాసోజు.