మూడు రాజధానులను గుంటూరు, విజయవాడ ప్రజలూ సమర్థించారు

543

గుంటూరు జనం మిరపకాయ ఘాటు చూపించారు
విజయవాడ, వైజాగ్‌ ప్రజలు పౌరుషం చూపించారు
చంద్రబాబూ నీకే పౌరుషం లేదు. అదే ఉంటే వెంటనే రాజీనామా చేయి
విలేకరుల సమావేశంలో వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

అర్బన్‌ ఓటర్లూ మా వెంటే:

‘మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఓటర్‌ అభిప్రాయం చాలా స్పష్టంగా కనిపించింది, ఇది చాలా గొప్ప విజయం, 21 మాసాల జగన్‌   పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో అర్భన్‌ ఓటర్‌ నాడి తెలిసింది. పట్టణ ప్రాంతాల్లో తమకు తమకు బలముందని, గెలుస్తామని విపక్షాలు ప్రచారం చేశాయి, 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు కార్పొరేషన్‌ ఎన్నికల కోసం ఊరూరు తిరిగి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేశారు. అయినా జనం ఆదరించలేదు. అంత సీనియర్‌ నాయకుడు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు’.

ప్రజలపై అచంచల విశ్వాసం:

‘సీఎం   వైయస్‌ జగన్‌ ఏ ఊరు వెళ్ళలేదు, ఈ ఎన్నికల్లో ఎక్కడా ప్రచారం చేయలేదు. ఎవరినీ ఓటు వేయమని అడగలేదు. కేవలం తన పనితీరును చూసి ఓటు వేస్తారని గట్టిగా నమ్మారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టను అని చెప్పి ఏ విధంగా యుద్దం గెలిచాడో, అదే విధంగా తన పాలన చూసి ఓటు వేస్తారని సీఎం  వైయస్‌ జగన్‌ ప్రజలపై అచంచల విశ్వాసంతో ముందుకు వెళ్లారు. అందుకు అర్బన్‌ ఓటర్లు అద్భుతంగా స్పందించారు’.

నిజమైన హీరో:

‘ఇంత బ్రహ్మండమైన విజయం నా రాజకీయ జీవితంలో చూడలేదు, అలాగే ఇంత వరెస్ట్‌ పర్‌పార్మెన్స్‌ చంద్రబాబుకే దక్కింది. రాష్ట్ర రాజకీయాల్లో నిజమైన హీరో ఎవరైనా ఉన్నారంటే ఒక్క సీఎం  వైయస్‌ జగన్‌ మాత్రమే’.

ఏం సమాధానం చెబుతారు?:

‘చంద్రబాబు, మీ అబ్బాయి ఎక్కడున్నారు?. ఎన్నికల ఫలితాల వేళ హైదరాబాద్‌లో ఎందుకు దాక్కున్నారు?. పాచి పనులు చేసుకోవడానికి హైదరాబాద్‌ వెళ్ళారా?. లేకపోతే ఎందుకు ముఖం చాటేశారు?. గతంలో ఈవీఎంలు ట్యాంపర్‌ చేశారన్నారు. మరి బ్యాలెట్‌ పేపర్‌తో జరిగిన ఎన్నికల్లో ఎందుకు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఏకగ్రీవాలపై చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్‌ మాట్లాడారు, ఏకగ్రీవాలు ఒప్పుకోమన్నారు, మరి ఇప్పడేం సమాధానం చెబుతారు?’.

రాబోయే ఎన్నికల్లోనూ ఇదే విజయం:

‘సీఎం  వైయస్‌ జగన్‌ను ఎదుర్కోవడానికి మీరు కాదు ఎందరొచ్చినా సాధ్యం కాదు, దత్తపుత్రుడు, సుపుత్రుడు ఈ రోజు ఎక్కడున్నారు, పవన్, లోకేష్‌లు రాష్ట్రం వదిలి పారిపోయారు, మీరు టూరిస్ట్‌లు తప్ప నాయకులు కాదు, పక్క రాష్ట్రంలో దాక్కున్నారా. లోకల్‌ బాడీ ఎన్నికలు పార్టీ గుర్తుల్లేకుండా జరిగాయి, మేం గెలిచాం అని టపాసులు కాల్చుకున్నారు, మరి ఇప్పుడు పార్టీ గుర్తులతో జరిగాయి, ఇప్పుడు కాల్చుకోండి టపాసులు. పంచాయతీల్లో తుక్కు తుక్కుగా ఓడిపోయారు, ఇప్పుడు మునిసిపల్, రేపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో కూడా తుక్కు తుక్కుగా ఓటమి ఖాయం’.
‘ఈ రాష్ట్రంలో టీడీపీ భూస్ధాపితం అయిపోయింది. జగన్‌   ఐదేళ్ళ పాలన పూర్తయ్యేసరికి టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్ధితి లేదు, వచ్చే శాసనసభ ఎన్నికలకు టీడీపీకి అభ్యర్ధులే లేకుండా పోతారు. తెలుగు తమ్ముళ్ళు ఆలోచించుకోండి, మీరు మార్గాలు చూసుకోవాల్సిందే’.

ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు:

‘ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిపక్షాలకు రాష్ట్రంలో పనే లేదు, చాప చుట్టుకోవాల్సిందే. జగన్‌   చెప్పింది చేసి చూపించారు, మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతీ హమీని అమలు చేసిన ఘనత ఆయనది. అందుకే ఈ అఖండ మెజారిటీ వచ్చింది’.
‘టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రుల వార్డులలో కూడా వైయస్సార్‌సీపీ గెలిచింది, మండలాలు, జడ్పీ ఎన్నికల్లో ఇంత కన్నా ఘనంగా ప్రజలు తమ మద్దతు చూపుతారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ ఎన్ని మ్యానిఫెస్టోలు ఇచ్చినా ప్రజలు నమ్మలేదు,  జగన్‌  చిత్తశుద్ది ఆయనకు విజయం చేకూరుస్తుంది’.

ఇకనైనా పద్ధతి మార్చుకో:

‘చంద్రబాబు ఇకనైనా అబద్దాలు మానుకో, బెదిరించడం మానుకో. గుంటూరు జనం మిరపకాయ ఘాటు చూపించారు, విజయవాడ, వైజాగ్‌ ప్రజలు కూడా పౌరుషం చూపించారు, నీకే పౌరుషం లేదు, పౌరుషమే ఉంటే నువ్వే రాజీనామా చేయాలి, ప్రజలకు పౌరుషం ఉంది కాబట్టి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించారు’.

మూడు రాజధానులకు..:

‘మూడు రాజధానులకు గుంటూరు, విజయవాడ ప్రజలు కూడా మద్దతిచ్చారు, ఇదే మాట నువ్వు చెప్పిందే కదా, ఇకనైనా నువ్వు నడిపే ఉద్యమాలు మానుకో’.. అని హితవు చెప్పిన అంబటి రాంబాబు ప్రెస్‌ మీట్‌ ముగించారు.