వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల దాడి

345

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అనంత…

అనంతపురం, మార్చి 14 (న్యూస్‌టైమ్): నగరపాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి ఘోరపరాజయం చెందిన నేపధ్యంలో ఓటమిని జీర్ణించుకోలేక లక్ష్మీనగర్ కు చెందిన పలువు టిడిపి నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో వైయస్సార్ కాంగ్రెస్ మైనార్టీ విభాగం నగర కార్యదర్శి హిదయతుల్, వైసిపి కార్యకర్త సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. కార్యక్రమం లక్ష్మీనగర్ వైసీపీ కన్వీనర్ చింతకుంట మధు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.