సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు

509

హైదరాబాద్, మార్చి 14 (న్యూస్‌టైమ్): 2020-21 ఆర్థిక సంవత్సరం ముగింపులో వస్తున్న రిజిస్ట్రేషన్స్ వత్తిడిని దృష్టిలో ఉంచుకుని నాన్ అగ్రికల్చర్ (వ్యవసాయేతర ఆస్తులు) ట్రాన్స్‌యాక్షన్స్ జరిగేందుకు ఈ నెలలో అన్ని సెలవు రోజులలో కూడా రాష్టంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేస్తాయని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, శాసనమండలి ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఆదివారం (మార్చి 14న) హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే, ఈ నెలలో ఇంకా మిగిలిన సెలవు రోజులలో (29న హోళి మినహా) నాన్ అగ్రికల్చర్ ట్రాన్స్‌యాక్షన్స్ జరిపేందుకు అన్ని జిల్లాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేస్తాయని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ‘ధరణి’ పోర్టల్ ద్వారా అగ్రికల్చర్ ల్యాండ్స్ ట్రాన్స్‌యాక్షన్స్‌కు అడ్వాన్స్‌గా స్లాట్ బుకింగ్‌తో తహసీల్దార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చునని ప్రభుత్వం వివరించింది.