ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

123

అమరావతి, మార్చి 14 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ తీవ్రతరం అవుతోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 45,664 కరోనా పరీక్షలు నిర్వహించగా 298 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 90 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 48 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 32, విశాఖ జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,91,861 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,83,277 మంది కరోనా ప్రభావం నుంచి విముక్తులయ్యారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 1000కి పైనే నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 7,184కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,184కి చేరింది. 24 గంటల్లో 164 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,400 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,45,34,762 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 50,998 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా 228 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,161కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒకరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1653కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 152 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,97,515కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,993 ఉండగా వీరిలో 795 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 46 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 92,00,465కి చేరింది.