తిరుపతి ఉపఎన్నికకు భాజపా నుంచి ఉమ్మడి అభ్యర్ధి

465

తిరుపతి ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్దిగా భాజపా
పోటీ చేయనుందని కేంద్ర మంత్రి, పార్టీ వ్యవహరాల రాష్ట్ర ఇన్‌ఛార్జి
మురళీధరన్‌ ఢిల్లీ నుంచి ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర
అధ్యక్షులు సోము వీర్రాజు భాజపా జాతీయ కార్యదర్శి వ్యవహారాల సహ
ఇన్‌ఛార్జి సునిల్‌ డియోధర్‌తో కలసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌,
ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్‌తో హైదరాబాద్‌లో శుక్రవారం భేటీ
అయ్యారు. ఈ సమావేశంలో, తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికకు సంబంధించి ఉమ్మడి
అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు.
అభ్యర్థి వివరాలను భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటిస్తుందని మురళీధరన్‌
తెలిపారు.