టీటీడీకి భారీ విరాళం…

239

టీటీడీకి ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. రూ.300 కోట్ల వ్యయంతో ఆస్పతి నిర్మాణానికి ముంబై వాసి సంజయ్‌సింగ్ ముందుకొచ్చారు. 300 పడకల ఆసుపత్రిని నిర్మించి టీటీడీకి అప్పగించేందుకు ఆయన అంగీకరించారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సమక్షంలో అధికారులు, సంజయ్‌సింగ్ యంవోయూ చేసుకున్నారు. తిరుపతిలో రూ.300కోట్లతో 300 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ముంబైకి చెందిన భక్తుడు సంజయ్‌సింగ్ ముందుకొచ్చారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మరో రెండు చోట్ల టీటీడీ ఆధ్వర్యంలో ఆస్పత్రులు నిర్మిస్తామని ప్రకటించారు. ఆస్పత్రుల నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటు చేశామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.