చిన్నా రెడ్డి గెలుపు ..తెలంగాణకి కొత్త మలపు

457
  • కేసీఆర్ మోసానికి గుణపాఠం చెప్పే అవకాశం
  • వ్యవస్థలని నిర్వీర్యం చేస్తున్న బిజేపికి పట్ట భద్ర మిత్రులు ఓటు వేయాలా ?
  • కెసిఆర్ ఎన్నికలు రాగానే పచ్చి అబద్ధాలతో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నారు.
  • చిన్నా రెడ్డి గారి గెలుపు పట్ట భద్రుల గెలుపు
  • నిజాయితీ పరుడైన చిన్నా రెడ్డిని  గెలిపిద్దాం
  • చిన్నారెడ్డి గెలుపు ద్వారా కేసీఆర్ కి మోడికి కనువిప్పు-టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

‘’చిన్నా రెడ్డి గెలుపు.. తెలంగాణకి కొత్త మలపు’’ అని అభివర్ణించారు ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఆద్వర్యంలో ఖైరతాబాద్ వాసవి సేవ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పట్ట భద్రులు తెలంగాణ గుండె చప్పుడు. తెలంగాణ ఉద్యమంలో వారే సైనికులు. ఇవాళ వాళ్ళే తెలంగాణ భవిష్యత్ ని నిర్ణయించబోతున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని మోసం చేసిన కేసీఆర్ ని, ఏడాదికి  2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దగా చేసిన ప్రధాని మోడీని చెంప చెళ్ళు మనిపించే అవకాశం ఈ రోజు తెలంగాణ పట్టభద్ర సోదరులకు వచ్చింది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యత వచ్చింది. ఏడేళ్ళుగా తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్న కేసీఆర్, నరేంద్రమోడీలకు సరైన గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి పట్ట భద్ర మిత్రులు మీ ఓటుతో ఇద్దరికి వాతలు పెట్టండి’’ అని కోరారు
‘’కాంగ్రెస్ పార్టీ దేశంలో వ్యవస్థలని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ బ్యాంకులని ఏర్పాటు చేసి ప్రజల ప్రతి పైసాకు భరోసా కల్పించి, యువతకు ఉద్యోగాలు కల్పించి దేశ ప్రగతికి పాటు పడింది. యువత జీవితాల్లో వెలుగు నింపింది. కానీ నేడు నరేంద్ర మోడీ తిరోగమన దిశగా పోతున్నారు. బ్యాంకులు,  రైల్వే, ఎల్ఐసి, ఎయిర్ వేస్, ఐడీపియల్ , డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలని కూడా అధానీ, అంబానీ, అమెజాన్ కంపెనీలకు అమ్మడానికి కంకణం కట్టుకున్నారు. ఆంధ్రుల హక్కు అయినా విశాఖ ఉక్కుని కూడా అధానీ కంపెనీకి అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలని నిర్వీర్యం చేస్తున్న మోడీకి, బిజేపికి పట్ట భద్ర మిత్రులు ఓటు వేయాలా ? దేశాన్ని అంబానీ, అధానీలకు  తాకట్టుపెడుతున్న బిజెపి ఓటు వేయాలా ?’’ పట్ట భద్ర మిత్రులు ఒక్కసారి ఆలోచన చేసుకోండి’’ అని కోరారు రేవత్ రెడ్డి.

కేసీఆర్ దుర్మార్గం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రో. జయశంకర్, కోదండరామ్ , నాయిని నరసింహ రెడ్డి లాంటి తెలంగాణ ఉద్యమ కారులని అవమానించి వాళ్ళన్ని పూర్తిగా చరిత్ర నుండి కనుమరు చేసిన కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షుడైన పీవీ గారి ఫోటో పెట్టుకొని ఓటు అడగడానికి వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవరెస్ట్ స్థాయి వున్న ఓ వ్యక్తి బిడ్డ.. ఈవాళ టీఆర్ఎస్ పార్టీ కోసం  ఓట్ల  అడుగుతుందంటే .. వీళ్ళంతా పీవీ గారి ఆత్మగౌరవం పెంచేవారా? తగ్గించే వారా ? పట్టభద్ర మిత్రులు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి.

‘’చిన్నా రెడ్డిగా గొప్ప మనిషి. నిజాయితీ పరుడు. పట్ట భద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తి. ప్రజల కోసం పేగులు తెగిన వరకూ కొట్లాడే మనిషి. అలాంటి గొప్ప వ్యక్తి కోసం పని చేయడం గొప్ప ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. చిన్నా రెడ్డి గారి కోసం యువకుడిగా వున్న రోజుల్లోనే పని చేశాను. మళ్ళీ ఇప్పుడు ఆయన కోసం ఎన్నికల ప్రచారంలో రావడం గొప్ప సంత్ర్హుప్తిని ఇస్తుంది. చిన్నా రెడ్డి గారి లాంటి అభ్యర్ధి తెలంగాణలో ఏ పార్టీకి లేరు. చిన్నా రెడ్డిగారి  గెలుపుతో ఆయనకేం రాదు. కానీ తెలంగాణ సమాజానికి అదో మలుపు అవుతుంది. నమ్మించి మోసం చేసిన కేసీఆర్ కి గుణపాఠం చెప్పినట్లు అవుతుంది. దేశాన్ని అంబానీ అధానీకి అమ్మేయాలని చూస్తున్న మోడీ గుణపాఠం చెప్పినట్లు అవుతుంది. చిన్న రెడ్డి గారి గెలుపు ద్వారా కేసీఆర్ కి మోడికి కనువిప్పు కలుగతుంది. దయచేసి పట్టభద్రమిత్రులారా.. ప్రశ్నించే గొంతుక చిన్నా రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి’’ అని కోరారు రేవంత్ రెడ్డి.
ఎమ్మెల్సీ అభ్యర్ధి  చిన్నా రెడ్డి మాట్లాడుతూ.. ‘’లక్షా 91వేల ఉద్యోగాలు మూడు నెలల్లో భర్తీ చేయాలి. నిరుద్యోగుల ఖాతాలో ప్రతి నెలా రూ. 3016 వేయాలి. ఎమ్మెల్సీగా గెలిచే అవకాశం వస్తే తాను చేసే మొదటి పోరాటం ఈ రెండు అంశాలపైనే. సీఎం కేసీఆర్ క్ వినతి పత్రం రాస్తా. వినకపోతే ప్రగతి భవన్ ముందు ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటా’’ అని హామీ ఇచ్చారు.
ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు మాట్లాడుతూ… ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో వైజాగ్ స్టీల్ కి మదత్తు ఇస్తామని చెబుతున్న కేటీఆర్.. ముందు బయ్యారం ఉక్కు కోసం పోరాటం చేయాలి’’ అని హితవు పలికారు.
‘’ తెలంగాణ ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్ర మిత్రులు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. టీఆర్ఎస్ గెలిస్తే మరో భజన బ్యాచ్ ని చట్ట సభకు పంపినట్లే అవుతుందని కానీ ప్రశ్నించే గొంతుకని కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. చిన్నా రెడ్డి గారు నిజాయితీ గల మనిషి. అలాంటి వ్యక్తి చట్ట సభల్లో వుంటే మన తరపున ఒక గొంతుకు వుంటుంది. మీ తరపున ప్రశ్నించడానికి మంచి మనిషి అయిన చిన్నా రెడ్డిగారికి అవకాశం ఇవ్వండి. మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించండి’’ అని విజ్ఞప్తి చేశారు దాసోజు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ , అనిల్ కుమార్ యాదవ్ , ఫిరోజ్ ఖాన్ , శివ్ సేన రెడ్డి ,   వేణుగోపాల్ రావు, కాళో సుజాత, ధనలక్ష్మీతో, ఎన్‌ఎస్‌యుఐ యువ నాయకులు  పాటు అనేక మంది ఉద్యోగ, నిరుద్యోగ, యువత   పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు .