స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ప్రకటనను ఖండిస్తున్నాం

470

విశాఖ జిల్లా: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనపై మానవ హక్కుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు గంటా రామ్ కుమార్ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 100 శాతం షేర్లు అమ్ముతామన్న కేంద్ర ప్రకటనను ఖండిస్తున్నామన్నారు. కేంద్రమంత్రి ప్రకటన ప్రభుత్వ రంగ సంస్థల పట్ల బీజేపీ నిజస్వరూపమేంటో తెలిసిందని వ్యాఖ్యానించారు.

బీజేపీపై ఇంకా రాష్ట్రంలో ఎవరికైనా భ్రమలు ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కలిసి రావాలన్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు మాతో కలిసి రావాలి, అని పిలుపునిచ్చారు. మానవ హక్కుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు గంటా రామ్ కుమార్ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కేంద్రం రైతులు విషయంలోనే జాలి చూపించలేదు… ధర్నాలు రాస్తారోకోలు చేసి వాళ్లే అలసిపోతారులే అనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది అని గంటా రామ్ కుమార్ తేల్చేశారు .కానీ ఏపీ అనగా ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ ఎలా ఉంటది అన్న విషయం కేంద్రానికి అర్థం కావటం లేదు అనేది మాత్రం నిజం .అందుకే తొందర పడుతుంది .ముందు ముందు కేంద్రానికి ఏపీ చుక్కలు చూపిస్తుంది అన్నదే నిజం  .ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తక్కువ అంచనా వేస్తుంది కేంద్రం అని అప్పట్లో కేంద్రం మంచి నిర్ణయం ఏపీ ప్రజలపై ఇంకా తీసుకోకపోతే దీని పరిణామాలు కేంద్రంపై బలంగా పడే అవకాశాలు ఉన్నాయి అని గంటా రామ్ కుమార్ అభిప్రాయపడ్డారు.