ముమ్మిడివరంలో గొల్లపల్లి ప్రచారం

371

కాకినాడ, మార్చి 8 (న్యూస్‌టైమ్): ముమ్ముడివరం నగర పంచాయతీ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న చెల్లి అశోక్ బాబును, వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కోరారు. రాజోలు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో సర్పంచ్ ఎన్నికల అనంతరం సమావేశంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ఓటమి అనేది విజయానికి నాంది అని, రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా తెలుగుదేశం పార్టీదే అని అన్నారు. సర్పంచ్ ఎన్నికలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధం ఉండదని, సర్పంచ్ ఎన్నికలు ఎక్కువగా వ్యక్తిగతంగా పని చేస్తారని, సర్పంచ్ ఎన్నికలతో పోల్చుకోవద్దు అని సూచించారు.

అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసిందని, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేస్తామని బెదిరించి ఓట్లు వేయించుకున్నారని గ్రామాలలో ఎక్కువమంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉండటంవల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి పోయాయని దాని ద్వారా అధికార పార్టీ బలపరచిన అభ్యర్థులు గెలుపొందుటకు ముఖ్య కారణం అని, రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని గొల్లపల్లి అన్నారు. అనంతరం రాజోలు ఉప సర్పంచ్‌గా ఎన్నుకోబడిన పామర్తి రమణకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు దుశ్శాలువా కప్పి పూల మాల వేసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బేతినీడి శ్రీనివాస్, బాలాజీ వేమా, కాండ్రేగుల భవాని, మోకా పార్వతీ, మట్టపర్తి లక్ష్మీ, కొత్తపల్లి విజయలక్ష్మి, చాగంటి స్వామి, నార్కెడమిల్లి కనకం, కోళ్ల వెంకన్న, పామర్తి రమణ, రావి మురళీకృష్ణ, మట్టా శ్రీనివాస్, అడబాల విజయ్, నార్కెడమిల్లి విష్ణు, కాండ్రేగుల రాము, షేక్ ఇష్మాయిల్, పితాని భాస్కర్, కడలి వెంకటరమణ, చెల్లింగి శ్రీనివాస్, పిన్నింటి ఆదినారాయణ, భద్ర, చెల్లింగి అబ్బులు, బోళ్ల రాజేష్, పట్నాల శ్రీనివాస్, కడలి రాజశేఖర్, ఇసుకపల్లి బలరామ రాజు, పితాని సూరిబాబు తదితరులు హాజరయ్యారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు గొల్లపల్లి సూర్యారావు, మాజీ శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు, చెల్లి వివేకానంద, గంటి హరీష్ మాధుర్, పేరాబత్తుల రాజశేఖర్, నాగిడి నాగేశ్వరావు, గుత్తుల సాయి, చాగంటి స్వామి, పితాని సూరిబాబు, గొలకోటి దొరబాబు, తాడి నర్సింహారావు, పొద్దోకు నారాయణరావు (బాలు), మందల గంగసూర్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, వాడ్రేవు వీరబాబు, అద్దాని శ్రీనివాసరావు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.