ఏపీలో నకిలీ మందులు తయారీపై దృష్టి

0
131

విజయవాడ, మార్చి 6 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మందుల విక్రయాలపై జగన్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ మందుల ముఠాను చేధించేందుకు స్పెషల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేయాలని డ్రగ్స్‌ ఐజి రవి శంకర్‌ నారాయణను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. దీంతో కొన్ని టీంలను ఏర్పాటు చేసిన అధికారులు వివిధ డ్రగ్స్‌ సంస్థలపై సోదాలు నిర్వహించారు. విజయవాడలో హరిప్రియ ఫార్మా ఏజెన్సీ, పాలకొల్లులో లోకేశ్వరీ మెడికల్‌ ఏజెన్సీల్లో సోదాలు నిర్వహించారు. ఇక్కడ పెద్ద మొత్తంలో నకిలీ మందులను గుర్తించిన అధికారులు ఈ రెండు ఏజెన్సీలను సీజ్‌ చేశారు. చండీఘర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ కేంద్రంగా నకిలీ మందుల రాకెట్‌ నడుస్తున్నట్లు గుర్తించారు.