ఓటు హక్కును వినియోగంపై అవగాహన

390

తెనాలి, మార్చి 6 (న్యూస్‌టైమ్): భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించునేందుకు పోలీసు శాఖ పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెనాలి డియస్పి డాక్టర్ కె. స్రవంతి రాయ్ అన్నారు. ఈనెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక 16వవార్దులో ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వన్‌టౌన్ సిఐ యం. రాజేష్ కుమార్ అధ్యక్షత వహించారు. డియస్పి డాక్టర్ స్రవంతి రాయ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటికే పట్టణంలోని అయా పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడిషిటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి బైండవర్ చేసినట్లు తెలిపారు. ఓటర్ల తమ ఓటు హక్కును నిర్భయంగా వేసేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అదనపు పోలీసు బలగాలను సైతం రంగంలోకి దింపినట్లు డియస్పి డాక్టర్ స్రవంతి రాయ్ వివరించారు. 8, 9 ఈ రెండు రోజులు వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో డబ్బులు, మద్యం పంపిణీ జరిపే అవకాశాలు ఉన్న తరుణంలో పోలీసులు పూర్తి స్థాయిలో నిఘాను ఉంచి గస్తీ తిరుగుతారని ఆమె వెల్లడించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మీ వార్దులలో ఎవరైనా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లం గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని డియస్పి డాక్టర్ స్రవంతి రాయ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ టి. అనిల్ కుమార్, సిబ్బంది ఉన్నారు.