‘మండలిలో సంపూర్ణ మెజార్టీ రాబోతోంది’

238

అమరావతి, మార్చి 4 (న్యూస్‌టైమ్): మార్చి నెలాఖరుతో శాస‌న మండలిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాబోతోందని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ‌స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున శాస‌న మండ‌లికి చ‌ల్లా భ‌గీర‌థ‌రెడ్డి, సీ రామ‌చంద్ర‌య్య‌, బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, దువ్వాడ శ్రీ‌నివాస్‌, మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌, క‌రిమున్ని‌సా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం వైయ‌స్‌ జగన్ పదవుల ఎంపికలో అభ్యర్థుల నిర్ణయంలో పారదర్శకత సామాజిక తూకం పాటిస్తున్నారన్నారు. వైయ‌స్ఆర్‌సీపీలో కష్టపడిన వారికి పదవులు వస్తాయనే నమ్మకం కార్యకర్తలకు ఉందన్నారు. కౌన్సిల్లోని మందబలాన్ని ఆసరా చేసుకుని ఇన్నాళ్లూ టీడీపీ ఏదో చేద్దామనుకుందని చెప్పారు.

ఇకపై వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమం-అభివృద్ధి సమపాళ్లతో కూడిన పాలన దిగ్విజయంగా సాగనుందని, వచ్చే మే నాటికి శాస‌న మండలిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాబోతోందని ‌స‌జ్జ‌ల పేర్కొన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్ పదవుల ఎంపికలో అభ్యర్థుల నిర్ణయంలో పారదర్శకత, సామాజిక తూకం పాటిస్తున్నారన్నారు. వైయ‌స్ఆర్‌సీపీలో కష్టపడిన వారికి పదవులు వస్తాయనే నమ్మకం కార్యకర్తలకు ఉందన్నారు. కౌన్సిల్లోని మందబలాన్ని ఆసరా చేసుకుని ఇన్నాళ్లూ టీడీపీ ఏదో చేద్దామనుకుందని చెప్పారు. ఇకపై వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమం-అభివృద్ధి సమపాళ్లతో కూడిన పాలన దిగ్విజయంగా సాగనుందని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎక్కువగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వటం, పార్టీ కోసం ముందు నుంచి నిలబడిన వారిని గుర్తించి సమపాళ్లలో సముచిత స్థానాలు ఇవ్వటం వల్లనే ఎక్కడా చిన్నపాటి సమస్య కూడా ఉండటం లేదు. కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని పార్టీలో అందరూ గుర్తించారు.

అందుకే, మిగిలిన పార్టీల్లో మాదిరిగా రాజకీయ సంస్కృతిలో భాగంగా ఉండే ఊహాగానాలు, అసంతృప్తులు వంటివి వైయస్‌ఆర్‌సీపీలో కనిపించవని, ఇది జగన్ నాయకత్వ ప్రతిభకు, సమన్యాయం అందించటంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ఉదాహరణగా నిలబడుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతిన్న తర్వాత కౌన్సిల్‌లో ఉన్న మందబలాన్ని ఆసరాగా చేసుకొని, సాంకేతిక కారణాలు చూపి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేయటాన్ని ప్రజలంతా గమనించారని, వాటికి కూడా ప్రజలు చరమగీతం పాడారన్నారు. ‘‘వచ్చే మేతో వైయస్‌ఆర్‌సీపీకి కౌన్సిల్‌లో మెజార్టీ వస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధికి జగన్ చేసే చర్యలకు ఉభయ సభలూ మద్దతు ఇవ్వటంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఊపు అందుకుంటాయి. సమీప భవిష్యత్‌లో అదీ పూర్తి అవుతుంది.’’ అని తెలిపారు. ఎంపికైన ఎమ్మెల్సీ అభ్యర్థులకు సజ్జల మరోసారి అభినందనలు తెలిపారు.