శాంతిభద్రతల పరిస్థితి దారుణం:కన్నా

400

శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైంది.  ప్రశ్నించే పార్టీ అయిన బీజేపీకి ప్రజలు పట్టం కట్టాలని కోరారు. ‘‘ బీజేపీ-జనసేనను గెలిపిస్తేనే గుంటూరు అభివృద్ధి చెందుతుంది. వైసీపీకి ప్రజాసంక్షేమంతో పనిలేదు. ఆ పార్టీతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కివెళ్లింది’’  అన్నారు. గుంటూరు నగరంలో అభివృద్ధి అంతా నేను మంత్రిగా ఉన్న సమయంలో  జరిగిందే గుంటూరు నగరంలో 24గంటల తాగునీటి పథకం ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలి. ఏడేళ్లలో ఒక్కరు కూడా దానిపై కనీసం సమీక్ష జరపలేదు దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?  అని బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
గుంటూరు బ్రాడిపేట 32వ డివిజన్ జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి దేచిరాజు సత్యంబాబు,  బిజెపి జనసేన ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ  మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి జగన్ కి తన పాలన పై నమ్మకం లేదు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీల వారిని బెదిరిస్తున్నారు. మా పార్టీ అభ్యర్థలను నామినేషన్లు వెనక్కు తీసుకోవాలని బెదిరించారు. ఎన్నికలకు ముందే అభ్యర్థులను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేం చాలా స్థానిక ఎన్నికలు చూశాం. గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు.. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలకు వెళ్లాం ఇపుడు అధికార దుర్వినియోగం, విచ్ఛలవిడితనంతో గెలవాలని చూస్తున్నారు  అన్నారు.

ఈ  కార్యక్రమంలో దేచిరాజు సత్యంబాబు,శనక్కాయల అరుణ,జూపుడి రంగరాజు,పాటిబండ్ల ఉషారాణి,తాళ్ల వెంకటేష్ యాదవ్,పాలపాటి రవికుమార్,ఉయ్యాల శ్యాంప్రసాద్,అమ్మిశెట్టి ఆంజనేయులు,నిజాముద్దీన్,నీలంప్రసాద్,కోట ప్రసాద్,నందిరాజు పాండు,అవుల వెంకటేశ్వరరావు,దర్శనం శ్రీనివాస్,బొల్లాప్రగాఢ శ్రీదేవి జనసేన నాయకులు వెంకట్రావు,ప్రసాదు తదితరులు పాల్గొన్నారు