హంతకులకు న్యాయవాదుల ఓట్లు అడిగే హక్కు లేదు:డా.దాసోజు శ్రవణ్

0
209

ఉపాధి కల్పనపై టీఆర్ఎస్ కు ఒక పాలసీ లేదు
టీచర్ ఉద్యోగాలు ఎందుకు  భర్తీ చేయలేదు
కేటీఆర్ తన మాట వెనక్కి తీసుకోవాలి
టీఆర్ఎస్  కుంభకోణాలు బయటపెడతాం
ఐటీఐఆర్ పై కాంగ్రెస్ పార్టీ దగ్గర పరిష్కారం వుంది
నిరుద్యోగుల బాధ అర్ధమౌతుందా కేటీఆర్ ?
అడ్వకేట్లుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మేలు సున్నా
తెలంగాణ అడ్వకేట్లపై దాడి చేసిన వారే నేడు మంత్రులు
కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వండి

న్యాయవాద దంపతుల హత్య కేసులో కేటీఆర్, కేసీఆర్ లు మొసలికన్నీరు కారుస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య. వామనరావు పై కేసీఆర్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. కానీ కోర్టు కేసుని స్వీకరించలేదు. ఈ పరిణామం జరిగిన కొద్దిరోజుల్లోనే న్యాయవాద దంపతలు హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని న్యాయవాదుల ఓట్లు అడుగుతున్నారు. హంతకులకు న్యాయవాదుల ఓట్లు అడిగే హక్కు ఉందా? ” అని ప్రశ్నించారు ఐసీసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.

ఉద్యోగ భర్తీలు , న్యాయవాదుల సమస్యలపై గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ఉద్యోగ ఖాళీలు, భర్తీలు అనే అంశంపై బహిరంగ చర్చకు మంత్రి కేటీఆర్ రావాలని సవాల్ చేశాం. కానీ కేటీఆర్ చర్చకు వచ్చే సాహసం చేయలేదు. అయినప్పటికీ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని కేటీఆర్ ఒప్పుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నాం. ఐతే కేటీఆర్ కి ఒక సూటి ప్రశ్న. గత ఏడేళ్ళు నుండి నేటి వరకూ ఖాళీగా వున్నాయని మీరే చెబుతున్నా ఒక లక్షా తొంబై ఒక్కవేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదో దానికి కారణాలు, సమాధానాలు కూడా చెప్పండి. అసలు మీకు ఉపాధి కల్పనపై మీకు ఒక పాలసీ అంటూ లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే కమిట్మెంట్ మీకు లేదు” అని ధ్వజమెత్తారు దాసోజు శ్రవణ్.

కేటీఆర్ ఆ మాట వెనక్కి తీసుకోవాలి :
 ”ఒక ప్రభుత్వం భాదత్య..  విద్య, వైద్యం, ఉపాధి, గృహనిర్మాణం, రవాణ.. కల్పించడం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ పక్కన పెట్టేసి మొద్దు నిద్రపోతుంది. ఉపాద్యాయులని భర్తీ చేయక విద్య వ్యవస్థ నాశనం చేసింది. హాస్పిటల్ లో వైద్యులు, సిబ్బందిని భర్తీ చేయక వైద్య వ్యవస్థని దెబ్బ తీశారు. గత ఏడేళ్ళు గా కుంబకర్ణుడు నిద్రపోతున్నట్లు వ్యవహరించి వ్యవస్థల్ని భ్రస్టుపట్టించారు. బహిరంగ చర్చకు రమ్మంటే రాకుండా ఏపీపీఎస్సీ ద్వారా కేవలం ఇరవై నాలుగు వేల ఉద్యోగాలే ఇచ్చారని కేటీఆర్ మళ్ళీ అదే అసత్యం మాట్లాడుతున్నారు. మేము ముందే చర్చకు రమ్మన్నాం. రాలేదు. ఇప్పుడు మళ్ళీ తప్పుడు మాట్లాడే మాట్లాడుతున్నారు. దయచేసి కేటీఆర్ ఈ మాటలని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం” అన్నారు దాసోజు.

టీచర్ ఉద్యోగాలు ఎందుకు  భర్తీ చేయలేదు?
డియస్సీ ద్వార ముమ్మడి రాష్ట్రంలో కొన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనే 2004, 2006, 2008, 2011 ఇలా వరుసగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది.  కానీ ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్ ఉద్యోగాల భర్తీని పూర్తిగా విస్మరించింది. డియస్సీ ఉద్యోగాలు.. ఉద్యోగాలు కావా ? టీచర్ ఉద్యోగాలని నియామకం చేయాల్సిన అవసరం  తెలంగాణాలో లేదా ? టీచర్ ఉద్యోగాలు ఎందుకు  భర్తీ చేయలేదు? మీ కారణంగా అనేక ప్రభుత్వ స్కూల్స్ మూతపడ్డాయి. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులు కార్పోరేట్ దోపిడీకి గురురౌతున్నాయి. మీరు కానీ సక్రమంగా టీచర్ నియామకాలు చేపట్టివుంటే ప్రజలకు ఈ పరిస్థితి  వచ్చేదా? అని ప్రశ్నించారు దాసోజు.

టీఆర్ఎస్  కుంభకోణాలు బయటపెడతాం :
రాష్ట్రం ఏర్పడ్డనాడు లక్షా ఏడు వేలు ఖాళీలు వుంటే ఇవాళ లక్షా తొంబై ఒక్క వేల ఖాళీలు ఎందుకు వున్నాయి ? ఎందుకు నింపలేదు ? దీనికి సూటిగా సమాధానం చెప్పండి” అని ప్రశ్నించిన దాసోజు శ్రవణ… సింగరేణిలో జరిగిన నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయి.  పంచాయితీ రాజ్ సెక్రటరీల రిక్రూట్మెంట్ లో కూడా భారీ కుంబకోణం జరిగింది. విధ్యుత్ రంగ నియామకాల్లో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఈ స్కామ్స్ కి సంబధించిన వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం” అని వెల్లడించారు దాసోజు.

టీఎస్పీఎస్సీ రాజ్యంగ బద్ధమైన కమీషన్. ఒక చైర్మన్ , పదిమంది సభ్యులు ఉండాల్సిన కమీషన్ లో నేడు ఇద్దరే వున్నారు. చైర్మన్ దిగిపోయి మూడు నాలుగు నెలలు దాటింది. నోటిఫికేషన్ ఇవ్వాలంటే  కోరం లేదు. కోరం ఉండాలంటే ముగ్గురు సభ్యులు ఉండాల్సిన పరిస్థితి. అంతేకాదు..300 మంది పని చేయల్సిన టీఎస్పీఎస్సీలో  80 మంది మాత్రమే వున్నారు. 80 మందితో ఎలా పని చేయాలి? ఇదంతా కూడా ఉద్యోగ కల్పన పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి భాద్యత లేనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు ఖాళీలు భర్తీ చేయడం లేదు ? ఎందుకు 300మంది పని చేసే దగ్గర 80మందే పని చేస్తున్నారు? ఎందుకు డీయస్సీ వేయలేకపోతున్నారు ? కేటీఆర్ సూటిగా సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

ఐటీఐఆర్ పై కాంగ్రెస్ పార్టీ దగ్గర పరిష్కారం వుంది:
”ఐటీఐఆర్ పై టీఆర్ఎస్, బిజెపి బురద చల్లుకుంటున్నాయి. లేఖలు రాసుకుంటున్నాయి. ఐతే ఈ లేఖల వల్ల ఎలాంటి ఉపయోగం వుండదు. దీనికి పరిష్కారం కాంగ్రెస్ పార్టీ దగ్గర వుంది. ఎందుకంటే ఐటీఐఆర్ రాహుల్ గాంధీ గారి కల. కాంగ్రెస్ హయంలో 5వేల ఎకరాల భూములని గుర్తించారు. కేంద్రం కేవలం 13వేల కోట్ల రూపాయిలు 15ఏళ్ల కాలంలో ఖర్చుపెట్టాలి.  కేంద్రంలో వున్న బిజెపి ఈ నిధులు ఇవ్వడం లేదని అందుకే తాము ఏమీ చేయలేకపోతున్నామనేది కేటీఆర్ వాదన. ఈ పస లేని వాదన పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా పరిష్కారం దిశగా అలోచించాలి. మొదటి ఐటీఐఆర్ మ్యానేజ్మెంట్ బోర్డ్ ఏర్పాటు చేయాలి. ఐటీఐఆర్ కి అవసరమైనవి కేంద్రప్రభుత్వం నుండి రావాల్సిన ప్రధాణంగా రెండు. ఒకటి 13వేల కోట్ల రూపాయిలు 15ఏళ్ల కాలంలో దశలు వారిగా రావాలి. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం.. కాంగ్రెస్ కి ఎక్కడ పేరు వస్తుందని భావించి నిధులు మంజూరు చేయని తరుణంలో ఈ 13వేల కోట్ల రూపాయిలని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చుపెడదాం. ప్రాజెక్ట్ కి సంబధించిన అన్ని మౌలిక వసతులు మన దగ్గర వున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం నుండి కావాల్సింది ట్యాక్స్ రిబేట్స్, దిగుమతి , ఎగుమతి పన్ను ప్రోత్సాహకాలు. వీటిని మోడీ ప్రభుత్వం మెడలు వంచి వీటి సాధిద్దాం. మీకు దమ్ములేకపొతే మీ వెంటే కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాహుల్ గాంధీ గారు వస్తారు. ఈ ప్రాజెక్ట్ వలన రెండున్న లక్ష కోట్ల రూపాయిల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. యాబై లక్షల ఉద్యోగాలు వస్తాయి. మేడిన్ తెలంగాణ అనేది రాహుల్ గాంధీ కల. ప్రజలు కూడా దయచేసి ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి” అని వివరించారు దాసోజు శ్రవణ్.

నిరుద్యోగుల బాధ అర్ధమౌతుందా కేటీఆర్ :
” వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో స్కిల్ డెవలప్ మెంట్ బోర్డ్ ద్వారా 5లక్షల ఉద్యోగాలకు శిక్షణ, ఉపాధి కల్పనా చేసారు. దాదాపు 770కోట్ల రూపాయిలు ఖర్చుతో యువత స్కిల్ డెవలప్ చేసి టైలరింగ్ నుండి డైమండ్ కటింగ్ వరకూ శిక్షణ ఇప్పించి ఉద్యోగ కల్పన చేశారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైయింది ? ఏడేళ్ళలలో ఒక్కడికైనా స్కిల్ డెవలప్ చేశారా ? తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దా ? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి కేటీఆర్. ఈ ఏడేళ్ళలో మీరు యువత స్కిల్ డెవలప్ చేయకపోవడం వలన ఎంతమంది యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారో ఆలోచనా ఉందా? ఎందుకు ఇంత భాదత్య రాహిత్యంగా వ్యవహరించి తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొడుతున్నారు? ”అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు దాసోజు.

అడ్వకేట్లుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మేలు సున్నా :
గత ఏడేళ్ళుగా దాదాపు ఏడేళ్ళు బార్ కౌన్సిల్ వారు ముఖ్యమంత్రికి అప్పోయింట్మెంట్  ఇవ్వమని లేఖలు రాశారు. ఒక్కసారి కూడా కేసీఆర్ అప్పోయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఈవాళ పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రగతి భవన్ నికి పిలిపించుకొని మీటింగ్ పెట్టారు. ఏ మొహం పెట్టుకొని ఇవాళ అడ్వకేట్లుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? తెలంగాణ ఉద్యమ కాలంలో అడ్వకేట్ల పోరాటం చరిత్ర మర్చిపోలేనిది. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత వారిని  జీపీలు చేశారా ? పీపీలు చేశారా ? వారు ప్రభుత్వ నియామకాల్లో వున్నారా ? తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే వ్యతిరేకంగా వ్యవహరించారు.. వాళ్ళు ఇవాళ జీపీలు పీపీలు అవుతా వుంటే బాధ కలగదా ?  ఇది అన్యాయం కదా ? అని  ప్రశ్నించారు దాసోజు.

ప్రతి ప్రభుత్వం బార్ కౌన్సిల్ కి ఒక కోటి నుండి రెండు కోట్ల రూపాయిలు ప్రతి ఏడాది నిధులు కేటాయిస్తుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా బార్ కౌన్సిల్ కి ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 56మంది అడ్వకేట్లు చనిపోయారు. చనిపోయిన వారి కుటుంబానికి బార్ కౌన్సిల్ నుండి నాలుగు లక్షల రూపాయిలు ఇచ్చారు. కానీ పక్కన వున్న ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం తరపు నుండి కూడా మరో నాలుగు లక్షలు కలుపుకొని ఏపీలో ఎనిమిది లక్షల రూపాయిలు ఇస్తున్నారు. మరి కేసిఆర్ ప్రభుత్వానికి ఏమైయింది ? అడ్వకేట్లు ఏం పాపం చేశారు ? తెలంగాణ పోరాటంలో వారి పోరాటానికి కేసీఆర్, కేటీఆర్లు ఇస్తున్న విలువు ఇదేనా ? అడ్వకేట్లకు ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారు.  ఇవ్వలేదు. మరి ఏ మొహం పెట్టుకొని అడ్వకేట్లతో మాట్లాడుతున్నారు కేటీఆర్ ”  అని ప్రశ్నించారు దాసోజు.

తెలంగాణ అడ్వకేట్లపై దాడి చేసిన వారే నేడు మంత్రులు :
2010లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇందిరా పార్క్ లో పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు. శ్రీ రంగా రావు, గండ్ర మోహన్ రావు .. ఇంకా చాలా మంది అడ్వకేట్లు బృందంగా ఏర్పడి .. చంద్రబాబు దీక్ష స్థలం వద్దకు వెళ్లి తెలంగాణ పై చంద్రబాబు వైఖరి చెప్పాలని డిమాండ్ చేసినప్పుడు .. అడ్వకేట్ల బృందం పై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ దాడిలో పాల్గొన్నది ఈవాళ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ పల్లకి మోస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, మహేందర్ రెడ్డి, మాగంటి గోపినాద్…  ఆవేళ దాడి చేసిన వారు ఈవేళ టీఆర్ఎస్ లో పెద్ద పదవులు అనుభవిస్తున్నారు. కనీసం ఒక్కరోజైన మేము ఆ రోజు చేసింది తప్పు అని క్షమాపణ చెప్పారా ? మనం కొట్లాడి తెచ్చిన తెలంగాణలో మనపై దాడి చేసిన వాళ్ళు గాదె కిందపంది కొక్కుల్లా దోచుకుతింటున్నారు. ఇలాంటి వాళ్లకు పట్టభద్రుల ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తామో అడ్వకేట్లు ఒకసారి అలోచించుకోవాలి” అని వివరించారు దాసోజు.

కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వండి:
”తెలంగాణలోని పట్టభాద్రులందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజిక వర్గంలో పోటిగా నిలిచినా ఉద్యమ కారుడైన రాములు నాయక్ ని, మంచితనానికి మారుపేరు అయిన చిన్నా రెడ్డిని మహబూబ్ నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజిక వర్గంలో గెలిపించాలని కోరుతున్నాను. మీ సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నాను” అని కోరారు దాసోజు శ్రవణ్.