యోగయ్య మృతికి ఏపీయూడబ్ల్యూజే సంతాపం

0
133

విజయవాడ, మార్చి 4 (న్యూస్‌టైమ్): సీనియర్ జర్నలిస్టు, విశాలాంధ్ర మాజీ అసిస్టెంట్ ఎడిటర్ మృతికి ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్లూజే) ప్రగాఢ సంతాపం ప్రకటించింది. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌ జరిగిన ప్రత్యేక సమావేశంలో యోగయ్య మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా సమయంలోను, తదనంతరం వరుసగా సీనియర్ జర్నలిస్టులను కోల్పోవడం బాధాకరమన్నారు.

సీనియర్ జర్నలిస్టు ఎస్‌.కె. బాబు, యూనియన్ అధ్యక్షుడు చావా రవి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు తదితరులు మాట్లాడుతూ యోగయ్య మృతి జర్నలిస్టు యూనియన్‌కు పత్రికా రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.