తెరాస విజయం ఖాయం

455

రానున్న ఎంఎల్సీ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని, సికింద్రాబాద్ నుంచి మంచి ఆధిక్యత లభించేలా కృషి చేస్తామని ఉప సభాపతి  తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరధిలో ఎంఎల్ సీ ఎన్నికల పై మంత్రులు  తలసాని శ్రీనివాస్ యాదవ్,   గంగుల కమలాకర్ లు సమీక్షను నిర్వహించారు. సితఫలమండీ లోని ఏం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో  బుధవారం ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెరాస అభ్యర్ధి  సురభి వాణి దేవికి పట్టభద్రుల నుంచి మంచి స్పందన లభిస్తోందని అన్నారు.,   తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెరాస శ్రేణులు, స్థానిక పట్టభద్రులు సమన్వయంగా వ్యవహరించేలా ఏర్పాట్లు జరుపుతున్నామని తెలిపారు.   తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసినట్లు తెలిపారు.  తెరాస యువ నేత శ్రీ తీగుల్ల కిశోర్ కుమార్,   పార్టీ పరిశీలకులు శ్రీనివాస్, నేతలు శ్రీ రాజ సుందర్, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 17 పోలింగ్ బూత ల పరిదిల్లో దాదాపు 10   వేలు  మందికి పైగా ఓటర్లు ఉన్న సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ఏర్పాట్ల పై మంత్రులు, నేతలు ఈ సందర్భంగా సమీక్షించారు.