ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు…..
ఇటీవల ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన.. ముప్పాళ్ల మండలం, గోళ్లపాడు గ్రామ వాసి,విద్యార్థిని కోటా అనూష కుటుంబాన్ని ఈరోజు.. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ లతో కలసి పరామర్శించడం జరిగింది. అనూష కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షల సాయాన్ని ..ఆమె కుటుంబ సభ్యులకు అందించటం జరిగింది.
అనూషపై జరిగిన అఘాయిత్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిందుతునికి కఠిన చర్యలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి ఘటనలు జరగకూడదనే.. ప్రభుత్వం దిశా చట్టం ప్రవేశపెట్టింది అని ఎంపి వెల్లడించారు.