మైనార్టీల‌కు అండ‌గా జ‌గ‌నన్న

198

టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ చేరిక‌లు
అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు..

జ‌గ‌నన్న అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు సంతోషాంగా ఉన్నార‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు. వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలో 54వ డివిజ‌న్ అభ్య‌ర్థి అబ్దుల్ అకీబ్ అర్షద్ అధ్వ‌ర్యంలో  టిడిపి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ  వ‌క్స్ బొర్డు స‌భ్య‌లు షేక్ ఆహ్మ‌ద్ ఇబ్ర‌హిం షేక్ మస్తాన్ మ‌రియు కాసీమ్‌, వ‌ల్లి, నాజీర్‌, ఎస్‌కె. అలీ, సిద్దిఖ్‌, నాయిమ్‌, షేక్ బాజీ దాదాపు 100 మంది కార్య‌క‌ర్త‌లు మంత్రి వెలంపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు.

బుధ‌వారం బ్రహ్మాణ వీధిలోని దేవదాయ ధర్మధాయ శాఖ మంత్రి కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స‌మ‌క్షంలో 39 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గుడివాడ రాఘ‌వా న‌రేంద్ర‌ ఆధ్వర్యంలో  ప‌లువురు మ‌హిళాలు  వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ   కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.