ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి టియంజేయూ మద్దతు….

0
305

ఆంద్రభూమి మూసివేత చట్ట విరుద్దమని ఆ సంస్థ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి టియంజేయూ మద్దతు….
పునరుద్ధరణ కు ఆందోళన…
రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని డిమాండ్……

దశాబ్దాల చరిత్ర కలిగిన అంద్రభూమి దినపత్రిక ను మూసివేయాలన్న నిర్ణయాన్ని యాజమాన్యం వాపసు తీసుకోవాలని, మూసివేయాలన్న కుట్రలపై అంద్రభూమి ఉద్యోగులు,సిబ్బంది చేస్తున్న పోరాటానికి తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్(TMJU) తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది….
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆంద్రభూమి దినపత్రిక మూసివేత చర్యలను అడ్డుకోవాలని డిమాండ్ చేసింది..

ఈ మేరకు టియంజేయూ కార్యాలయంలో రాష్ట్ర అద్యక్షుడు సూర్యప్రకాష్ రెడ్డి అద్యక్ష్యతన జరిగిన అత్యవసర సమావేశం లో కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆంద్రభూమి ఉద్యోగులు, సిబ్బందికి ఏడాది కాలంగా బకాయి పడిన వేతనాలు, పి.ఎఫ్,ఎరియర్స్,చెల్లించాలని డిమాండ్ చేసారు.

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో దక్కన్ క్రానికల్ కేసు పెండింగ్ లో ఉండగా ఆంద్రభూమి పత్రిక మూసివేత చెల్లదని,చట్టవిరుద్దమని, ఆంద్రభూమి యాజమాన్యం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టియంజేయూ డిమాండ్ చేసింది.ఆంద్రభూమి మూసివేత విషయాన్ని తమ జాతీయ యూనియన్ ఏన్ యూ.జే (ఐ),ప్రెస్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్ళి ఆంద్రభూమి ఉద్యోగులకు న్యాయం జరిగే పోరాటానికి అండగా ఉండాలని తీర్మానించారు.

సమావేశంలో ప్రధాన కార్యదర్శి విజయ్ రాజ్, కార్యనిర్వహక ఉపాధ్యక్షుడు సయ్యద్ సిరాజుద్దిన్, గ్రేటర్ అధ్యక్షుడు అరవింద్, కార్యదర్శి శాంతికిరణ్,,రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.రమేశ్ తదితర నాయకులు పాల్గోన్నారు…