మంత్రి కొడాలి నానిపై ఇంజనీరింగ్ విద్యార్థుల్లోనూ అభిమానం

397

చిత్రపటంపై ఆటోగ్రాఫ్ తీసుకున్న బీటెక్ విద్యార్థి తేజ

రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) పై ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా కొండంత అభిమానాన్ని చూపుతున్నారు . నందివాడ మండలం జనార్ధనపురం గ్రామానికి చెందిన లావేటి తేజ తాను ఎంతగానో అభిమానించే మంత్రి కొడాలి నాని చిత్రాన్ని స్వయంగా తన చేతితో వేశాడు . చిత్రలేఖనంలో ఏ మాత్రం అనుభవం లేని తేజ మాత్రం మంత్రి కొడాలి నానిపై పెంచుకున్న అభిమానాన్ని వినూత్నంగా చూపించాడు . గుడివాడ పట్టణం ఏలూర్ రోడ్డులోని వీకేఆర్ , వీఎన్‌బీ అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ మెకానికల్ థర్డ్ ఇయర్ చదువుతున్న తేజ మంత్రి కొడాలి నానిని కలిసి తాను పెన్సిల్ తో వేసిన చిత్రపటాన్ని చూపించారు . దానిపై మంత్రి కొడాలి నాని ఆటోను తీసుకున్నాడు . దీన్ని చిత్రపటంగా తయారు చేయించుకుని తన దగ్గరే భద్రపర్చుకుంటానని తేజ చెప్పాడు . ఈ కార్యక్రమంలో బీటెక్ విద్యార్థి అలుగోలు చైతన్య తదితరులు పాల్గొన్నారు.