బొగ్గు ట్రాలీ బోల్తా: ఆరుగురు మృతి!

393

కాన్పూర్, మార్చి 2 (న్యూస్‌టైమ్): ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహాత్‌లో ట్రాలీ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. నిన్న అర్థరాత్రి బొగ్గు లోడుతో వెళుతున్న ట్రాలీ మవూ ముగల్ రోడ్డు సమీపాన బోల్తాపడింది. దీంతో ట్రాలీలో ఉన్న కూలీలంతా దాని కింద చిక్కుకుపోయి ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కాగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కూలీలు హమీర్‌పూర్ జిల్లాలోని వర్నావ్, కలౌలీ, తీర్ గ్రామాలకు చెందినవారని పోలీసులుు గుర్తించారు. వీరంతా ట్రాలీలో కూర్చుని కూలీ పనుల కోసం ఇటావాలోని సిర్సాగంజ్ వెళుతున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఆరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.