సికింద్రాబాద్‌లో బలీయమైన శక్తిగా బీజేపీ

269

– కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సికింద్రాబాద్ మహంకాళి జిల్లాలో బీజేపీ బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభినందించారు. మంగళవారం శ్యాంసుందర్ జన్మదినం సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి, శ్యాంసుందర్ గౌడ్‌కు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో సమస్యలు అన్వేషించి, వాటి పరిష్కారం కోసం నేతలు కృషి చేయాలని సూచించారు.

రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి రామచందర్‌రావును గెలిపించడాన్ని, ప్రతి ఒక్క కార్యకర్త ప్రతిష్ఠగా తీసుకోవాలని  పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు శ్యాం మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై బీజేపీ నేతలు ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఆ మేరకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేటర్లు సరళ,  దీపికారాం, సుచిత్ర, బీజేపీ జిల్లా నేతలు రాజశేఖరరెడ్డి,  రాచమల్లు కృష్ణమూర్తి, మేకల సారంగపాణి, జంపన ప్రతాప్, లంకెల దీపక్‌రెడ్డి, మండూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

‘గాంధీ’లో వాక్సిన్ తీసుకున్న కిషన్‌రెడ్డి..
అంతకుముందు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే ముందుగానే, మోదీ ప్రభుత్వం వ్యాక్సిన్ టీకా తెచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. అయితే మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని సూచించారు.