‘మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయం మాదే’

377

అనంతపురం, మార్చి 1 (న్యూస్‌టైమ్): పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమగ్రమైన ప్రణాళికను రూపొందించామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పంచాయతీ ఎన్నికల కంటే మిన్నగా మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని తాడిపత్రి, రాయదుర్గం, కల్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి మున్సిపాలిటీలు, అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లలోని వైయస్‌ఆర్‌ సీపీ ముఖ్యనేతలు, శాసనసభ్యులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్‌ నారాయణ, ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభ్యర్థులను ఇవాళ ప్రకటిస్తామని చెప్పారు.

ఇప్పటికే ముఖ్య నేతలతో మాట్లాడామని, నాయకులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించడం జరిగిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం ఖాయమన్నారు. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. వలంటీర్లపై ఆంక్షలను ఎస్‌ఈసీ పునరాలోచించాలని సూచించారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు.

చంద్రబాబు అధికారంలో ఉండగా 100 శాతం పన్నులు పెంచారని బొత్స సత్యనారాయణ చెప్పారు. 2018 డిసెంబర్‌లో నీటిపన్నును సుమారు 40 శాతం నుంచి 100 శాతం పెంచడానికి జీవో ఇచ్చారా? లేదా? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పన్నులు పెంచుతూ జీవో ఇచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగ్గిస్తామని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని మంత్రి బొత్స మండిపడ్డారు. పన్నులు తగ్గిస్తామంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని, దయచేసి బాబు మాటలు విని ప్రజలెవరూ మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని చంద్ర‌బాబుకు తెలియ‌దా?

రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంద‌ని చంద్ర‌బాబుకు తెలియ‌దా అని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నిల‌దీశారు. ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌రిగితే చంద్ర‌బాబు మాత్రం దౌర్జ‌న్యాలు జ‌రిగాయంటున్నార‌ని ఫైర్ అయ్యారు. అనంత‌పురంలో సోమ‌వారం పార్టీ నేత‌ల‌తో ‌స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌తి పేద‌వాడికి అందుతున్నాయ‌ని చెప్పారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ప‌ని చేసి విజ‌యం సాధిస్తామ‌ని చెప్పారు. అబ్ధాల‌తో ప్ర‌జ‌లు త‌ప్పుదోవ ప‌ట్టించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీకి అభ్య‌ర్థులు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. తిరుప‌తి ఎయిర్ పోర్టులో చంద్ర‌బాబు డ్రామా ‌సృష్టించార‌ని విమ‌ర్శించారు. టీడీపీ నేత‌ల‌ను బెదిరించాల్సిన అవ‌స‌రం మాకు లేద‌న్నారు. చంద్ర‌బాబు త‌న పార్టీ ప‌రిస్థితిపై ఆత‌త్మ ప‌రిశీల‌న చే‌సుకోవాల‌ని సూచించారు. ఎస్ఈసీ అనుమ‌తి లేకుండా తిరుప‌తికి వ‌చ్చి బాబు నానాయాగీ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

‘‘గ‌తంలో వ‌చ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా అంద‌రూ స‌మ‌న్వ‌య‌కంతో ప‌ని చేయాల‌న్నారు. లేని ప్ర‌తిప‌క్షం గురించి మాట్లాడ‌టం అన‌వ‌స‌రం. 2019లో ప్ర‌జ‌లు ఛీకొట్టి టీడీపీని డ‌‌స్ట్‌బీన్‌లో ప‌డేశారు. చంద్ర‌బాబు త‌న‌కున్న స‌స‌హ‌జ ల‌క్ష‌ణంతో , త‌న‌కున్న మీడియాతో, ట‌క్కుట‌మార విద్య‌లు ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ప్ర‌ద‌ర్శించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులు కూడా దొర‌క‌డం లేదు. ఈ ప‌రిస్థి‌తిని ఊహించి ముందే ఏదో ఘోరాలు జ‌రిగిపోతున్నాయ‌ని ఈ రోజు తిరుప‌తిలో ఆందోళ‌న చేస్తాన‌ని డ్రామా చేస్తున్నారు. ఇంత ప్ర‌శాంతంగా ఎన్నిక‌లు ఎప్పుడు జ‌ర‌గ‌లేదు. టీడీపీకి నామినేష‌న్ వేసేందుకు అభ్య‌ర్థులు దొర‌క‌డం లేదు. దీంతో నామినేష‌న్లు వేయించ‌డం లేద‌ని కొత్త రాగం అందుకున్నారు. 40 ఏళ్ల రాజ‌కీయ పార్టీకి ఇవాళ నామినేష‌ష‌న్ వేస్తే ఎవ‌రైనా ఆప‌గ‌ల‌రా? పార్టీ గుర్తు లేని పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ క్లిన్‌షిప్ చేసింది.’’ అని తెలిపారు.

‘‘పార్టీ గుర్తుతో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. మా పార్టీలోనే పోటీకి ఎక్కువ మంది ముందుకు వ‌స్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో ఎయిర్‌పోర్టులో డ్రామాలు చేస్తున్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌తో అనుమ‌తి తీసుకోకుండా ఎయిర్‌పోర్టులో డ్రామా చేస్తే ఎవ‌రైనా విలువ ఇస్తారా? . ఆ రోజు వైయ‌స్ జ‌గ‌న్‌ను విశాఖ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వెళ్తే ఆరోజు వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆపింది దారుణం. దాన్ని దాష్టికం అంటారు. ఈ రోజు ఎలాంటి కార‌ణం లేకుండానే చంద్ర‌బాబు నానాయాగీ చేస్తున్నారు. దీన్నిచౌక‌బారుత‌నం, దిగ‌జారు త‌నం అంటారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మేనిఫెస్టో విడుద‌ల చేసి ప్ర‌జ‌ల‌ను మభ్య‌పెడుతున్నారు. మున్సిపాలిటీ ప‌రిధిలో లేని హామీలు ఇస్తున్నారు. ఎవ‌రిని మోసం చేయాల‌నుకుంటున్నారో అర్థం కావ‌డం లేదు. ప్ర‌జ‌లంద‌రిని కోరుతున్నాం. ఎన్నిక‌లంటే నిష్ప‌క్ష‌పాతంగా జ‌ర‌గాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కోరుకుంటున్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తోంది. మాకు మేమే నిబంధ‌న‌లు పెట్టుకొని ఎన్నిక‌ల్లో నిజాయితీగా ప‌ని చేస్తున్నాం. ఇలాంటి స‌మ‌యంలో చంద్ర‌బాబు డ్రామాలు ఆడ‌టం స‌రికాద‌ు.’’ అని స‌జ్జ‌ల పేర్కొన్నారు.

చంద్రబాబు ఎన్ని డ్రామాలాడినా టీడీపీ బతకదు

ప్రతిపక్షనేత చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్టులో చేస్తున్న ధర్నా ఓ డ్రామా అని ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ ధ్వజమెత్తారు. మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులో చంద్రబాబు వైఖరిని మంత్రి తీవ్రంగా ఖండించారు. మంత్రి శంకర్‌ నారాయణ మీడియాతో మాట్లాడుతూ 40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి ఎన్నికల కోడ్‌ గురించి తెలియదా అని నిలదీశారు. టీడీపీని కాపాడుకునేందుకు చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నాడన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి తప్పదని బాబుకు భయపడుతున్నారన్నారు. టీడీపీ భూస్థాపితం అయిందని, చంద్రబాబు ఎన్ని పాట్లు పడినా టీడీపీ బతకదని స్పష్టం చేశారు.