గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తా

401

గుడివాడ రూరల్ మండల సర్పంచ్ లను అభినందించిన మంత్రి కొడాలి నాని

గుడివాడ నియోజకవర్గంలోని రూరల్ మండల సర్పంచ్ లను రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అభినందించారు . బుధవారం స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం సర్పంచ్ పోటూరి వెంకటేశ్వరమ్మ,  ఆమె భర్త శ్రీమన్నారాయణ, పర్నాస సర్పంచ్ గొర్ల రాజేష్ లు కలిశారు . వీరిని మంత్రి కొడాలి నాని పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు .

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు , ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల గురించి సర్పంచ్ తో చర్చించారు . అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందన్నారు . గ్రామాల అభివృద్ధి పైనే సర్పంచు ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు . ఇందు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తనవంతు సహకారాన్ని గుడివాడ నియోజకవర్గంలోని సర్పంచ్ లందరికీ అందజేస్తానని తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు . ప్రజల అవసరాలను ఎప్పటికపుడు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు . గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయిస్తానని చెప్పారు .

గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా సర్పంచు పనిచేయాలన్నారు . గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు . గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని , వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని మంత్రి కొడాలి నాని తెలిపారు . ఈ కార్యక్రమంలో కల్వపూడి అగ్రహారం గ్రామానికి చెందిన ఏలేటి అగస్టీన్ , కగ్గా అప్పన్న , కరారి దావీదు , కోట రాజేష్ , తురక ప్రభుదాసు , గుజ్జర్లమూడి నాగబాబు , వరిగంజి పెద్దిరాజులు , కరారి వెంకన్న , హెసూరి తాతారావు , కగ్గా శ్రీనివాస్ , మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ , పర్నాస గ్రామానికి చెందిన పట్టెం కోటేశ్వరరావు , కడియం నాగయ్య , పట్టెం సురేష్ , సరిహద్దు సుధీర్ , పట్టెం ధర్మయ్య , పట్టిం సోమయ్య , పట్టెం అంజిబాబు , దోనే రాజారావు , మేరే కోటయ్య , పసల భూషణం , కడియం ఇస్సాక్ , మేడపాటి దావీదు , దోమతోటి నాగమల్లి తదితరులు పాల్గొన్నారు .