కలెక్టర్ చంద్రుడుకు పీఎం కిసాన్ అవార్డు

521

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ అవార్డు సొంతం చేసుకుని వ్యవసాయ రంగంలో మరోసారి అనంతపురం జిల్లా  సత్తా  చాటింది. న్యూఢిల్లీ లోని పుసా ప్రాంతం పరిధిలోగల ఏపీ షిండే హాల్, ఎన్ ఏ ఎస్ సి కాంప్లెక్స్ లో నిర్వహించిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో,   జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  పీఎం కిసాన్ జాతీయ అవార్డును అందుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి  నరేంద్ర సింగ్ తోమర్ నుంచి పీఎం కిసాన్ జాతీయ అవార్డును  అందుకున్నారు.   పీఎం కిసాన్ కింద లబ్ధిదారుల ఫిజికల్ వెరిఫికేషన్ విభాగంలో జిల్లాకు వరించిన జాతీయ అవార్డు  ఇది. పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారిలో 28,505 మంది రైతుల వెరైఫికేషన్ ను జిల్లా యంత్రాంగం పూర్తి చేయగా.. జాతీయ స్థాయిలో మరే జిల్లాలోనూ లేని విధంగా 99.60 శాతం రైతుల వెరిఫికేషన్ పూర్తి చేయడంతో జిల్లాకు  జాతీయ అవార్డు   లభించింది. కాగా యువ కలెక్టర్ గంధం చంద్రుడు వెనుకబడిన అనంతపురం జిల్లాపై ఇప్పటికే తనదైన ముద్ర వేశారు. నిరంతరం ప్రజల్లో ఉండే ఆయన గ్రామీణ ప్రాంతాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఆయన పనితీరును మెచ్చుకున్న కేంద్రం ట్విట్టర్‌లో అభినందించడం విశేషం.