పల్లె తల్లి పండగ..!!

905

(  వై.వి.రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్ )

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా..!!
నిరాశిర్నిర్మయో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః..!!

భగవద్గీత ఉద్దేశాన్ని ఈ శ్లోకము స్పష్టముగా సూచిస్తుంది. సైనిక క్రమశిక్షణలా విధి నిర్వహణ చేయాలని ఈ శ్లోకము చెబుతోంది. ఈ శ్లోకము చెప్పినట్లు దేవుడిని తలస్తూ విధులు నిర్వహించాలి. “నిరాశీ:” అంటే దేవుని ఆదేశం మేరకు పనిచేయాలి కానీ..ఫలితాలు ఆశించకూడదు. పాలకులు “విగతజ్వరుడు”అంటే కలతలేనివాడు, మత్తులేనివాడు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి ఈ శ్లోకం అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే..ఆయన దేవుడ్ని బలంగా నమ్ముతాడు. అంతా దేవుడు చూసుకుంటుంటాడు, దేవుడి దయ అంటుంటారు. ప్రతిపక్షాలె ఎన్ని విమర్శలు చేసినా కర్తవ్య నిర్వహణలో వెనక్కు తగ్గరు.తాను చేయాల్సింది దేవుడు ఆదేశించినట్లు చేసుకుంటూపోతారు. నీ పనే  దైవం అని భగవద్గీతలో ఉంటుంది. ప్రజాసేవనే దైవంగా భావించి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి కులం,మతం, ప్రాంతం కనిపించవు. ఆయనకు మనుషులు కనిపిస్తారు. పేదరికంలో ఉన్న తల్లులు కనిపిస్తారు. బడికి పోలేని చిన్నారులు కనిపిస్తారు. మంచి చదువులు చదివి ఉద్యోగంలేని యువత కనిపిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేని రైతన్న కనిపిస్తాడు. చేతినిండా కళ ఉన్నా పని లేని చేతి వృత్తులవారు కనిపిస్తారు. వీరందరీ కోసం ఈ 21 నెలల పాలనా కాలంలో సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టని పథకం లేదు. ప్రజలనే దేవుళ్లుగా, పనే  దైవంగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఈ 21 నెలల పాలన  సాగించారు. అందుకే…పల్లె తల్లి పులకించి అపూర్వమైన విజయాన్ని  పంచాయతీ ఎన్నికల్లో కట్టబెట్టింది.

2019, మే ఫలితాలు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి కష్టానికి, ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. అందుకే..151 అసెంబ్లీ సీట్లతో పట్టాభిషేకం చేశారు. రాజన్నలా పాలించమని దీవించారు. ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి వమ్ము చేయలేదు. 21 నెలల పాలనా కాలంలో పల్లెల్లో సంక్షేమానికి పట్టం కట్టారు. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు మళ్లించారు. అందుకే ..పంచాయతీ ఎన్నికల ఫలితాలు వన్‌ సైడ్ వచ్చాయి. పంచాయతీ ఎన్నికలంటే స్థానిక అభ్యర్ధి గుణగణాలు, ప్రజాసేవ, మాట్లాడే తీరు, కులం ఆధారంగా ఓట్లు వేస్తారు. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులు ఉండవు. కానీ..ప్రత్యక్షంగానే రాజకీయ పార్టీల ప్రమేయం ఉంటుంది.

ఈ ఎన్నికలకు ముందు టీడీపీ, ఎస్‌ఈసీ  నిమ్మగడ్డ రమేష్ చేసిన హడావిడితో మరింత రాజకీయ రంగు పులుముకున్నాయి. 2019 అసెంబ్లీ ఫలితాలు గాలివాటం అనేది చంద్రబాబు భావన. పంచాయతీ  ఎన్నికలు పెడితే తమ అభ్యర్దులకే గ్రామీణం పట్టం కడుతుందని చంద్రబాబు అండ్‌ కో అంచనా వేశారు. వారికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కూడా సహకరించారు.  వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు అండ్‌ కో ముందుకు కదిలింది. మొదట ఏకగ్రీవాలు ఆమోదించలేదు. తరువాత టీడీపీ తయారు చేసిన యాప్‌ను వాడుకోవాలని చూశారు. కోర్ట్ అక్షింతలతో నిమ్మగడ్డ వెనక్కితగ్గారు.
గ్రామాల్లో గొడవలు పెట్టి రాజకీయంగా లాభపడాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఏకగ్రీవాలపై  చంద్రబాబు అండ్‌ కో గందరగోళం సృష్టించింది. ఏకగ్రీవాలతో గ్రామాలు అభివృద్ధికి చిరునామాగా  మారుతాయి అనడంలో  సందేహం లేదు. అధికారంలో ఎవరున్నా, ప్రతిపక్షంలో ఎవరున్నా ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి. గ్రామాల అభివృద్ధికి  తోడ్పడాలి. కానీ..చంద్రబాబు మాత్రం ఏకగ్రీవాలు కాకుండా చూడటానికి శతవిధాలుగా ప్రయత్నించారు. కానీ…తెలివైన ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా 2వేలకు పైగా పంచాయతీలను ఏకగ్రీవాలు చేశారు. వీటిలో వైఎస్‌ఆర్‌ సీపీ బలపర్చిన అభ్యర్దులు 98 శాతం ఉండటం విశేషం.

రాజకీయంగా చంద్రబాబు నాయుడు గందరగోళం సృష్టిస్తున్నప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి  ఎంతో హుందాగా, పరిణితి చెందిన నాయకుడిగా వ్యవహరించారు. ఎక్కడా మాట కూడా మాట్లాడలేదు.  కానీ..చంద్రబాబు మాత్రం తన మద్దతు మీడియాతో అసత్యాలను సిగ్గులేకుండా నిర్భయంగా ప్రచారం చేయించారు.  ప్రజలు మాత్రం  జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల వైపే ఉన్నారని మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల రోజే తేలిపోయింది.  చంద్రబాబు అండ్ కో టక్కు టమారా విద్యలు ఎన్ని ప్రదర్శించినా ప్రజలు మాత్రం వైఎస్‌ఆర్‌ సీపీ సానుభూతి పరులనే పంచాయతీ ప్రెసిడెంట్‌లుగా ఎన్నుకున్నారు.  దీంతో చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి అబద్దాలు చెప్పడం ప్రారంభించారు.

చంద్రబాబు మద్దతు మీడియా ఈ అబద్దాలను నిస్సంకోశంగా, సిగ్గులేకుండా రాసింది, ప్రచారం చేసింది.
నాలుగు విడతల్లో కలిపి 13085 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు 80.03 శాతం ఓట్లతో 10,460  పంచాయతీలను కైవసం చేసుకున్నారు.  టీడీపీ 16.04 శాతం ఓట్లతో 2112 పంచాయతీలను తన ఖాతాలో వేసుకుంది. ఇక..బీజేపీ 1.45 శాతం ఓట్లతో 190 స్థానాలు గెల్చుకుంది. ఇతరులు 2.46 శాతం ఓట్లతో 323 పంచాతీలను గెల్చుకున్నారు. ఇతరుల్లో వైఎస్‌ఆర్‌ సీపీ రెబెల్స్ ఉండటాన్ని మనం గుర్తించాలి. ఇక..మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ చెప్పినట్లు వైఎస్‌ఆర్‌ సీపీ రెబల్స్‌ వల్లనే టీడీపీ 2 వేల పంచాయతీలైనా గెల్చుకుంది. లేకపోతే..1500 లోపు పంచాయతీలకే టీడీపీ మద్దతు దారులు పరిమితమయ్యేవారు. ఇక్కడ వైఎస్‌ఆర్‌ సీపీ అగ్రనేతలు ఒక్కటీ గుర్తించాలి. గ్రౌండ్ లెవల్లో వైఎస్‌ఆర్‌ సీపీ సేవకులు ఎవరో గుర్తించాలి. వారికి తగిని గుర్తింపు ఇవ్వాలి.లేనిపక్షంలో భవిష్యత్తులో రెబెల్స్‌ బెడద మరింత ఎక్కువై టీడీపీకి లాభం చేకూర్చే అవకాశముంది.

2019 , మేతో పోల్చుకుంటే ఈ 21 నెలల్లో వైఎస్‌ఆర్‌ సీపీ తన ఓటు బ్యాంక్‌ను పెంచుకుంది. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ 49.95 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చింది. 21 నెలల పాలనలో వ్యతిరేకత ఎక్కడా కనిపించకపోగా పాజిటివ్‌ ఓటును వైఎస్‌ఆర్‌ సీపీ పెంచుకుంది. సహజంగానే వైఎస్‌ఆర్‌ సీపీకి పల్లెల్లో పట్టు ఎక్కువ. ఆ పట్టును నిలబెట్టుకోవడంమే కాకుండా గ్రామాల్లో మరింత పట్టును సాధించింది. పోలైన ఓట్లలో 80శాతం పైగా ఓట్లను సాధించింది. ఇక..టీడీపీకి 2019 ఎన్నికల్లో 39.17 శాతం ఓట్లు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో కేవలం16.04 శాతం ఓట్లను  సాధించి తన పతనాన్ని తానే కోరి తెచ్చుకుంది.  వైఎస్‌ఆర్ సీపీ రెబెల్స్‌ తెచ్చుకున్న ఓట్లు కూడా బీజేపీ – జనసేన తెచ్చుకోలేక పోయాయి. బీజేపీతో జనసేన పొత్తు అని చెబుతున్నప్పటికీ చాలా చోట్ల టీడీపీ – జనసేన కలిసి పని చేశాయనే టాక్ ఉంది.  పంచాయతీ ఎన్నికల్లో మొదటి సారిగా సీఎం పని తీరును పరిగణనలోకి తీసుకుని ఓటు వేయడం గమనార్హం. వైఎస్‌ఆర్‌ సీపీకి ఓటింగ్ శాతం పెరగడానికి ఇదే కారణం.

విడతలవారీగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూద్దాం

…………………….
మొదటి  విడత
……………………
YSRCP –  2616
TDP – 510
BJP –  46
OTH – 73
…………….
రెండో విడత
……………….
YSRCP –  2654
TDP – 536
BJP- 40
OTH – 95
…………………..
మూడో విడత
…………………..
YSRCP – 2604
TDP – 527
BJP- 19
OTH –  66
……………………

నాలుగో విడత
……………………….

YSRCP – 2581
TDP –  539
BJP –  85
OTH –  89
……………………

టోటల్
……………………..
YSRCP- 10455
TDP -2112
BJP -190
OTH -323

ఈ  ఫలితాలు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనా తీరుకు నిదర్శనం.  చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో కూడా వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు 80శాతంపైగా పంచాయతీల్లో పాగా వేశారు. చంద్రబాబు ఏడు  సార్లుగెలిచిన కుప్పం నియోజకవర్గంలో 90శాతం  పంచాయతీలను వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంది. కుప్పంలో 93 పంచాయతీలు  ఉంటే మూడో విడత ఎన్నికల్లో 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు 75 స్థానాల్లో విజయం సాధిస్తే 14 సీఎంగా ఉన్న చంద్రబాబు మద్దతుదారులు కేవలం 14 స్థానాల్లో విజయం సాధించారు.

ఓటింగ్ పరంగా చూస్తే 31వేల ఓట్లతో చంద్రబాబు కుప్పంలో ఓడిపోయినట్లు లెక్క. నాలుగో విడతలో నారావారి పల్లెలో జరిగిన ఎన్నికలో ఓటుకు రూ5వేలు, శారీ, కుక్కర్ పంచి గెలిచి ఓడారు. ఇక…సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల్లో 108  పంచాయతీలు ఉంటే 108 పంచాయతీల్లోనూ వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు విజయఢంకా మోగించారు.108లో 90 చోట్ల వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులు ఏకగ్రీవమయ్యారు. 18 చోట్ల ఎన్నికలు జరిగితే 18 పంచాయతీ పంచాయతీల్లోనూ వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు.

అమరావతి చుట్టుపక్కల గ్రామ పంచాయతీల్లోనై వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అంటే…రాజధాని తరలింపు ఓటర్లను ప్రభావితం చేయలేదు. రాజధాని తరలింపుకు స్థానికులు ఓటేసినట్లైంది. అంతేకాదు..చంద్రబాబు చేసిన ఉద్యమం కృత్రిమ ఉద్యమం అని తేలిపోయింది. ఇప్పటికైనా చంద్రబాబు కుల,మత, ప్రాంత రాజకీయాలు కాకుండా ప్రజాకోణంలో రాజకీయాలు చే స్తే నిలబడతారు. లేకుంటే ప్రజలే చంద్రబాబును రాజకీయంగా పడగొడతారు. పంచాయతీ ఎన్నికల నుంచి చంద్రబాబు పాఠాలు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే 2024 ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది.

వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు పంచాయతీ విజయం నుంచి బయటకు వచ్చి మన్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లపై వైఎస్‌ఆర్‌ సీపీ దృష్టి పెట్టాల్సిన అవసరముంది. గుంటూరు, విజయవాడ ఎన్నికలపై రాజధాని తరలింపు ప్రభావం ఉంటుంది. ఇక్కడ అధికార పార్టీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.గెలవకుంటే..ప్రజలు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం మొదలుపెడతారు.

గెలిస్తే..రాజధాని తరలింపుకు ప్రజలు ఓటేశారని వైఎస్‌ఆర్‌ సీపీ ప్రచారం చేసుకోవచ్చు. విశాఖ నగరంలో 2019 ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెల్చుకుంది. వీరిలో గణేష్ వైఎస్ఆర్‌ సీపీలో చేరారు. కానీ…విశాఖ స్లీట్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ప్రధానం కానుంది. అలాగే..విశాఖ పరిపాలన రాజధాని కానుంది. కాబట్టి ఇక్కడ వైఎస్‌ఆర్‌ సీపీకి విజయం ఎంతో అవసరం. ప్రస్తుత సర్వేలు ప్రకారం వైఎస్‌ఆర్‌ సీపీకి జస్ట్ ఎడ్జ్‌ ఉంది. ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి మెజార్టీ సీట్లు గెల్చుకోవడానికి వైఎస్‌ఆర్‌ సీపీ వ్యూహరచన చేయాలి.  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విజయ సాయిరెడ్డి చేసిన 25 కిలో మీటర్ల పాదయాత్ర వైఎస్‌ఆర్‌ సీపీకి ప్లస్‌. ఈ వేవ్‌ను ఇలానే కొనసాగించాలి. పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా వైఎస్ఆర్‌ సీపీకి తిరుగులేదనే విధంగా ఎన్నికల ఫలితాలు ఉండాలి. అప్పుడే…రాజన్న రాజ్యం దిశగా వడివడిగా అడుగులు పడతాయి.