టీడీపీ పరిస్థితి అంపశయ్య నుంచి చితిలో పడినట్టైంది

179

టీడీపీ 40 శాతం గెలిస్తే.. గెలిచిన అభ్యర్థుల ఫోటోలతో సహా ప్రకటించే దమ్ము ఉందా..?
 చంద్రబాబు సొంతూరులో వార్డులు గెలిచినా సంబరాలా..?
 సర్పంచ్  ఎన్నికల్లో 25 మీడియా సమావేశాలు పెట్టిన మహా ఘనుడు చంద్రబాబే..!
 నాలుగు ఛానళ్ళలో ఊదరగొడితే టీడీపీ పుంజుకున్నట్టా..!
 అటు కుప్పం.. ఇటు చంద్రగిరిలో ఓడారు.. చంద్రబాబుకు రాజకీయ పతనం పూర్తిగా సమాప్తం.
    మంత్రి అనిల్ కుమార్ యాదవ్

దేశ చరిత్రలోనే తొలిసారిగా టీడీపీ, చంద్రబాబు నాయుడు ఓడిపోతే సంబరాలు చేసుకుంటున్నారు. 13,000 పైచిలుకు సర్పంచ్ స్థానాలకు నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 10,500 స్థానాలకు పైగా వైయస్‌ఆర్‌సీపీ (81%) మద్దతుదారులు గెలుచుకొన్నారు. కేవలం 16% స్థానాలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. దీన్నో పెద్ద విజయంగా టీడీపీ చెప్పుకోవటం దిగజారుడుతనమే. ఆ 16% కూడా వస్తాయని టీడీపీ ఊహించుకున్నారో, లేదో. ప్రతిదశ ఎన్నికల్లో అంచెలు అంచెలుగా టీడీపీ పుంజుకుందని, వైయస్‌ఆర్‌సీపీ పతనం మొదలైందని మీడియా సమావేశంలో చంద్రబాబు అనటంపై మంత్రి అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో 81% వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారు. దీనికి సీఎం  జగన్ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలే కారణం. టీడీపీకి ఆ 16% కూడా రావటానికి వైయస్‌ఆర్‌సీపీ రెబల్స్‌ పోటీ చేయటమే కారణం. పైగా 41% పంచాయితీ స్థానాలను కైవసం చేసుకున్నామని చంద్రబాబు చెప్పటానికి సిగ్గుండాలి. ఎల్లో మీడియాలో నాలుగు ఛానల్స్‌ ద్వారా ఇష్టానుసారంగా బాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా అభూత కల్పన. చంద్రబాబుకు దమ్ము, ధైర్యమే ఉంటే ఆయన లెక్క ప్రకారం నాలుగో విడతలో 1200-1300 స్థానాలు వచ్చి ఉండాలి. దమ్ముంటే వారికి వచ్చిన సర్పంచ్‌ అభ్యర్థులను కండువా వేసి నిలబెట్టే దమ్ముందా? నిజంగా 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు పనిచేస్తే.. ఏ జిల్లాలో అయినా ఈ 1300 మంది మా మద్దతుదారులు గెలిచారని చెప్పే దమ్ముందా? ఏదో అబద్ధం చెప్పేసి పండుగ చేసుకొని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు గెలిచి పార్టీ కండువాలతో పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు.

చంద్రబాబు పుట్టిన ప్రాంతం చంద్రగిరిలో 107 పంచాయితీలు ఉంటే 104 చోట్ల ఓడిపోయి.. 3 పంచాయితీలు మాత్రమే గెలిచారు. అలా గెలిచిన చోట్ల ఆయన పుట్టిన ఊరు ఉంది. అందులో 8 వార్డులు గెలుచుకున్నారని సంబరాలు చేసుకుంటున్నారు. అలా వార్డులు గెలిచినందుకు సంబరాలు చేసుకోవటంపై సిగ్గు ఉండాలి. ఓవైపు చంద్రబాబు పుట్టిన చంద్రగిరిలో డిపాజిట్లు కోల్పోయారు. బాబు వలసపోయిన కుప్పంలో 89 పంచాయితీల్లో 74 వైయస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిచారు. చంద్రబాబు ఇలాకాలోనే 20% సీట్లు సాధించలేని టీడీపీ 41% సీట్లు సాధించామని చెప్పుకోవటం ఏంటి? ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి ఉందా?

పదేళ్ల పాటు ప్రజల్లో ఉండి వారితో మమేకమై తనపని తాను చేసుకుంటూ సీఎం  జగన్ ముందుకు వెళ్తున్నారు. కానీ సర్పంచ్  ఎన్నికల్లో 25 మీడియా సమావేశాలు పెట్టిన మహా ఘనుడు ప్రతిపక్షనాయకుడు చంద్రబాబే. ఇలా సర్పంచ్‌ ఎన్నికల్లో ఇన్ని మీడియా సమావేశాలు పెట్టిన ఘనుడు దేశంలో మరొకరు ఉండరు. పోలీసులు దౌర్జన్యాలు చేస్తున్నారని చంద్రబాబు అంటారు. ఓవైపు దత్తపుత్రుడు అనొచ్చో, ఇంకొకటి అనొచ్చే తెలీదు కానీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమారే పోలీసు యంత్రాంగం బాగా చేసిందని..  అధికారులు బాగా పనిచేశారని పొగుడుతున్నారు. కానీ చంద్రబాబు ఏమో పోలీసులు రావణకాష్ఠం చేశారంటారు. అదే నేను చేసుంటే అని చంద్రబాబు అంటున్నారు. ఒక్కసారి చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకోవాలి. గతంలో ఎంపీటీసీ, జెడ్ పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా టీడీపీ వాళ్ళు రాద్ధాంతం చేశారు.  అదీ రావణకాష్ఠం అంటే. రౌడీ రాజ్యం అది. అక్కడ నుంచి ఈరోజు రామరాజ్యం  జగన్ మోహన్ రెడ్డి రాజ్యంలో సుభిక్షంగా ప్రశాంతమైన వాతావరణంలో 10,500కు పైగా సర్పంచ్‌ స్థానాలు వైయస్ఆర్సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.

చంద్రబాబు ఆ నాలుగు ఛానల్స్‌ మీద ఆధారపడ్డారు. ఆ ఛానల్స్‌లోనే టీడీపీ పుంజుకుందంటారు. ఎక్కడ పుంజుకుంది టీడీపీ. పతనమైంది వైయస్‌ఆర్‌సీపీ కాదు. ఎవరు పతనం అయ్యారో .. అందరికీ తెలుసు. కనీసం ఒక్క నియోజకవర్గంలో 40% సీట్లు సాధించామని చెప్పటానికి ఒక్కచోటైనా ఉందా?  కంచుకోట అనేది ఎక్కడైనా ఉందా?  కుప్పంలోనే చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టారు. సిగ్గులేకుండా ఇవాళ మీడియా సమావేశం పెట్టి 8 వార్డులు గెలుచుకున్నారట. దానికి సంబరాలంట. లేకపోతే 10% అదనంగా వచ్చేవని చంద్రబాబు అంటారు.  మా రెబల్స్ లేకపోతే సింగిల్‌ డిజిట్‌ వచ్చి ఉండేవి. ఈరోజు వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులకు వచ్చిన ఫలితాలే మున్సిపల్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో తిరిగి పునరావృతం అవుతాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

చివరకు చంద్రబాబు మతిస్థిమితం కోల్పోతున్నారు. 2024 నాటికి బూత్‌లలో మెజార్టీ వచ్చినా సంబరాలు చేసుకునే రోజు టీడీపీకి వస్తుంది. చివరకు అంపశయ్య నుంచి చితిలో పడిపోయే పరిస్థితికి టీడీపీ వచ్చింది. ఆల్మోస్ట్‌ టీడీపీ క్లోజ్‌. వైయస్ఆర్సీపీ 80 శాతం పైగా మద్దతుతో ఎక్కడో పైన ఉంటే..  కింద ఉన్న ప్రతిపక్ష పార్టీలు మేమే జగన్ కి ప్రతిపక్షం అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. రెండోస్థానం కోసం ప్రతిపక్షాలు కొట్లాడుకుంటున్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీలు ఎక్కడున్నాయి.

చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఆఖరికి స్వామీజీలపైన కూడా విమర్శలు చేస్తున్నాడు.  ఈరోజు  స్వరూపానంద స్వామి గారి మీద చంద్రబాబు పడుతున్నారు. ఏమీ చేయలేక క్షుద్రపూజలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. వెన్నుపోటు, క్షుద్రపూజలపై పేటెంట్ హక్కులు పూర్తిగా చంద్రబాబుకు మాత్రమే ఉన్నాయి. కనకదుర్గమ్మ, కాళహస్తి ఆలయాల్లో లోకేశ్‌ను అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబే క్షుద్రపూజలు చేయించారు. అబద్ధాలను నిజాలుగా చెప్పాలన్నా పేటెంట్ హక్కులు చంద్రబాబుకే ఉన్నాయి. అలాంటి వాటిపై సర్వహక్కులు చంద్రబాబుకే ఉన్నాయి. వాటిని వేరే వాళ్లకు ఇవ్వొద్దు. 15-16%లకు మాత్రమే టీడీపీ ఎందుకు మిగిలిపోయిందని.. ఓటమిపై సమీక్ష చేసుకోకుండా ఇష్టమొచ్చినట్లు మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడితే ఎవ్వరూ పట్టించుకోరు.

ఆ కంచుకోటలు బద్ధలు కొట్టాం. ఈ కంచుకోటలు బద్ధలు కొట్టామని టీడీపీ ప్రచారం చేసుకోవటం ఏంటి? ఆ మంత్రి దగ్గర, ఈ మంత్రి దగ్గర ఒక పంచాయితీ గెలిచామని సిగ్గులేకుడా టీడీపీ నేతలు మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోంది. కుప్పం అనే కంచుకోటను వైయస్‌ఆర్‌సీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. చంద్రబాబు పుట్టిన చంద్రగిరి పోయింది. బాబు వలస పోయిన కుప్పం పోయింది. చంద్రబాబుకు రాజకీయ పతనం పూర్తిగా సమాప్తం. చివరికి చంద్రబాబుకు అంటూ ఒక నియోజకవర్గమూ లేదు. పుట్టిన ఊరు, వలస వెళ్లిన ఊరు పోయిందని ముందే చంద్రబాబు తెల్సుకొని హైదరాబాద్‌కు మకాం మార్చేశారు. హైదరాబాద్ తన ఊరుగా చంద్రబాబు డిసైడ్ చేసుకున్నారు.  మంగళగిరి నుంచి ఎప్పుడో పంపించేశారు. కొత్తగా పంపించేది ఏముంది? రాజధాని ప్రాంతమైన తాడికొండలోనూ 70% సర్పంచ్‌లు వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు గెలుచుకొన్నారు.

ఈరోజు ప్రజలు మరింత బాధ్యతను  జగన్ పై ఉంచారు. వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులకు మరింత బాధ్యతను ప్రజలు పెంచారు. జగన్ పై నమ్మకాన్ని పెట్టుకున్న ప్రతి ఓటరుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు కల్లబొల్లి మాటలు మానుకోమని విజ్ఞప్తి చేస్తున్నాము. లేకపోతే 2024 నాటికి బూత్‌లు గెలిచామని సంబరాలు చేసుకునే పరిస్థితి టీడీపీ వస్తుంది. ఒక నియోజకవర్గంలో 200 బూత్‌లు ఉంటే ఓ 10 బూత్‌లు టీడీపీ గెలిచిందని సంబరాలు చేసుకునే పరిస్థితికి వస్తుంది.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..

పంచాయతీల్లో కేవలం 16% సీట్లు ఇచ్చి, ప్రతిపక్ష పాత్రకు చంద్రబాబు పనికి రారని ప్రజలు డిసైడ్ చేశారు. చంద్రబాబును కుప్పంలోంచి కుప్పలో వేశారు.

– 2014లో నెల్లూరు జిల్లా, నెల్లూరు జిల్లా పరిషత్‌లో 34 స్థానాలు వైయస్‌ఆర్‌సీపీ గెలుచుకుంటే టీడీపీ వారు ఏవిధంగా వ్యవహరించారో అందరూ చూశారు. రౌడీయిజం అంటే అది. కర్నూలులో ఏ విధంగా చేశారో అందరూ చూశాం. మేం పచ్చ పార్టీ. మాకు పచ్చకామెర్లు ఉన్నాయి. లోకమంతా పచ్చకామెర్లు ఉన్నాయని అనుకోవటం వారికే చెల్లబాటు. మాకు కాదు. టీడీపీ చేసిన దుర్మార్గాలు అందరూ చేస్తారని చంద్రబాబు అనుకోవటం అవివేకం.

– ఎస్‌ఈసీ నిమ్మగడ్డే పోలీసు, అధికార యంత్రాంగం బాగా పనిచేసిందిన కితాబు ఇస్తుంటే.. చంద్రబాబులా అందరూ దరిద్రమైన పనులు చేస్తారని అనుకోవటం అవివేకం.

– మంగళగిరిలో లోకేశ్ ఎన్ని గెలిచారు? గెలుపు సంఖ్యతో వస్తుందా? దేనితో వస్తుంది. వీరోచితంగా పోరాడే 16% గెలుచుకున్నారు కదా. మా రెబల్స్‌ అక్కడక్కడ ఉండబట్టే వారికి 16% అన్నా వచ్చాయి. లేకపోతే సింగిల్‌ డిజిటే టీడీపీకి దక్కుతుంది. టీడీపీ గెలిచిన స్థానాల లిస్ట్‌ చూస్తే.. మా రెబల్స్‌ ఉండటం వల్లనే గెలిచారు. లేకపోతే సింగిల్ డిజిట్‌కు మాత్రమే టీడీపీ పరిమితం అవుతుంది.

– ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు .. ఓడిపోయి.. ఇలా చంద్రబాబు మాట్లాడుతుంటే సిగ్గు ఉండాలి. వారి 16% గెలిస్తే బాగా గెలిచినట్లా? మేం గెలిచిన 10,500 చోట్ల బాగా జరగనట్లా? ఇదేం న్యాయం.

– లోకేశ్ మా తాత, మా నాన్న ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ… ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ విమర్శలు.. 10,500 చోట్ల గెలిచిన వారిని అందర్నీ అవమానిస్తున్నట్లే. ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత ప్రజాతీర్పు గౌరవించాలి.

– కనకదుర్గమ్మ, శ్రీకాళహస్తిలో క్షుద్రపూజలు ఎవరు చేశారు? స్వామిని దణ్ణం పెట్టుకుంటే ఒకలా, పెట్టుకోకపోతే.. మరోలా చంద్రబాబే మాట్లాడతారు. టీడీపీ వాళ్లకే ప్రజలు కరెంట్ కట్ చేశారు. అందరికీ కరెంట్ కట్ అయిందంటే ఎలా?

– అధికారంలోకి వస్తామని చంద్రబాబు కలలు కనటం ఓ భ్రమ. లోకేష్ లాంటి వారసుడ్ని పెట్టుకొని .. అద్భుతమైన సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమం చూసిన తర్వాత కూడా అధికారంలోకి వస్తామని చంద్రబాబు కలలు కంటున్నాడంటే.. అవి పగటి కలలే.