జగన్ అత్యుత్తమ పాలనకు అద్దం పట్టిన పంచాయతీ ఫలితాలు

223

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పంచాయతీ ఎన్నికల్లో పల్లెలు సీఎం  వైయస్ జగన్  పాలనకు పట్టం కట్టాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్రపార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 13,095 పంచాయతీలకు గానూ 10,536 పంచాయతీల్లో వైయస్ఆర్‌సిపి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. రికార్డు స్థాయిలో 80.51 శాతం పంచాయతీల్లో వైయస్‌ఆర్‌సిపి విజయకేతనం ఎగురవేసిందని అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాలతో వైయస్‌ఆర్‌సిపి దూసుకుపోగా, తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మొత్తం పంచాయతీల్లో టిడిపి కేవలం 2063 స్థానాలకే పరిమితమైంది. అంటే, టీడీపీ 16.05 శాతంతోనే చతికిలపడింది. అయినా మేం యాబైశాతం మేర గెలిచామంటూ చంద్రబాబు సిగ్గు లేకుండా తన అనుకూల పత్రికల్లో రాయించుకున్నాడు. ఈ ఎన్నికలతోనే రాష్ట్రంలో టిడిపి పునాదులు కదిలిపోతున్నాయనేది అందరికీ అర్థమవుతోంది.

దేశంలోనే అత్యుత్తమ పాలనను అందిస్తున్న సీఎంలలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్న సీఎం శ్రీ వైయస్ జగన్ గారి పాలనకు ఈ ఎన్నికలు దర్పణం పట్టాయి. ఏడాదిన్నరలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో దాదాపు తొంబై శాతం నెరవేర్చిన ఘనత సీఎం శ్రీ వైయస్ జగన్ గారికే దక్కుతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ప్రజాసంక్షేమానికి, అభివృద్ధికి ఆయన పాటుపడ్డారు. దాని ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వైయస్‌ఆర్‌సిపి బలపరిచిన అభ్యర్ధులను గెలిపించడం. రానున్న పురపాలక, పరిషత్ ఎన్నికల్లోనూ వైయస్‌ఆర్‌సిపి ఇంతకంటే మెరుగైన ఫలితాలను సాధిస్తుంది.

కుట్రలు, కుతంత్రాలతో ఏదో ఒక రకంగా విజయం సాధించాలని ప్రయత్నించి టిడిపి అధినేత చంద్రబాబు చతికిలపడ్డారు. ప్రజాస్వామిక స్పూర్తికి నిదర్శంగా ఈ ఎన్నికల ఫలితాలు వున్నాయి. తన సొంత నియోజకవర్గం కుప్పంలో, తన ద్వారా లబ్దిపొందిన వారితో పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేసినా కూడా చంద్రబాబు అరకొర స్థానాలకే పరిమితమయ్యారు.

చంద్రబాబు మొదటివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత మమ్మల్ని విమర్శించాడు.  రెండో విడత ఫలితాలు వెలువడగానే ఎన్నికల కమిషన్‌ను విమర్శించాడు. ఇప్పుడు నాలుగో విడత ఫలితాలు కూడా వెలువడగానే యాబై శాతం మేమే గెలిచామంటూ చెప్పుకుంటున్నాడు. ఒక్కో విడతలో ఒక్కో విధంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లుతుంది.  పంచాయతీ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు మతి చెలించింది.

తాను సీఎంగా వున్నప్పుడు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడేవాడిని అని చంద్రబాబు పదేపదే చెప్పుకునేవాడు. నిజంగా ఆయన అంత కష్టపడితే గత ఎన్నికల్లో ప్రజలు అలాంటి ఫలితం ఎలా ఇచ్చారో?
–  సీఎం వైయస్ జగన్ నిత్యం ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. పారదర్శక పాలనతో ప్రజలకు చేరువ అయ్యారు. అందుకే ఆయనకు పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు అండగా నిలిచారు.

పురపాలక, పరిషత్ ఎన్నికలపై మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

– పార్టీ కేంద్ర కార్యాలయంలో కృష్ణాజిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో భేటీ
– అన్నిచోట్లా పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలని పిలుపు
– పంచాయతీ ఎన్నికల స్పూర్తితో పరిషత్ ఎన్నికల్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలి

మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో నేపథ్యంలో కృష్ణాజిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం అయ్యారు. జిల్లాలోని మండల, జిల్లా పరిషత్ అభ్యర్ధులు, అలాగే ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌ లలోనూ వైయస్‌ఆర్‌సిపి ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు, ప్రజలతో మంచి సంబంధాలు కలిగివున్న కార్యకర్తలను ఎంపిక చేసి, ఎన్నికల్లో పోటీకి దిగాలని కోరారు.

– ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వైయస్‌ఆర్‌సిపి బలపరిచిన అభ్యర్థులకు పెద్ద ఎత్తున మద్దతు పలికారని, ఇదే స్పూర్తితో పార్టీ గుర్తుతో జరుగుతున్న పరిషత్, పురపాలక ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ విజయాలను సొంతం చేసుకోవాలని అన్నారు. అన్నిచోట్లా అభ్యర్ధుల ఖరారులో పార్టీ నిర్ధేశించిన ప్రమాణాలను పాటించాలని, ముఖ్యమంత్రి వైయస్ జగన్  పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలని అన్నారు.

– ఈ సమావేశంలో జిల్లా మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని),  కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని),  వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్సా మినేని ఉదయభాను, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి,  మేకా ప్రతాప్ అప్పారావు,  జోగి రమేష్, మల్లాది విష్ణు, రక్షణనిధి, పార్టీ నాయకులు లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు.