మునగాకుతో ఒంట్లో కొవ్వును బయటకు నెట్టు !

0
323

Can Moringa Leaves : దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి . ఈ చెట్లు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో .. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే . పోషకాలు కూడా ఎక్కువే . ఆకులే కాదు వాటి పువ్వల్లో కూడా మంచి ఔషధ గుణాలు కలిగి వున్నాయ . మునగ శాస్త్రీయ నామం ‘ మొరింగ బలిఫెర ‘ ఇది మొరింగేసి కుటుంబంలోనిది . విశేషమైన పోషకాలున్న చెట్టుగా ఇది ప్రసిద్ది కూడా . 5000 సంవత్సరాల క్రితమే ఇది వాడుకలో వున్నట్లు తెలుస్తోంది . మునక్కాయలు అంటే దక్షిణాది తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో … సాధారణంగా మునగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది మునక్కాయలు . వీటిని అందరూ ఇష్టంగా లాంగించేస్తారు .

మునక్కాయలే కాకుండా ఆకుల్లోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది . మునగాకులో ఎ , సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి . మునగాకులో ఎ , సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి . మునగాకులో అనేక విసమిన్లు , మినరల్స్ వున్నాయి . అలాగే కాల్షియం , పాస్పరస్ , ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి . అసలు 4 , 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది . ఆయుర్వేదంలో 300 లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు .

ఆరోగ్యంతోపాటు అధిక బరువును తగ్గించి , పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో మునగాకులు సహాయపడతాయి . అధిక మొత్తంలో పోషకాలు లభించే ఆహార పదార్థాల్లో మునగాకులు ముందు స్థానంలో ఉంటాయి . మునగ ఆకు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడమే కాదు , రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుంది . రక్తంలోని అధిక చక్కెరలను నియంత్రించి శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపుతుంది . పెద్ద పేగులను కూడా శుభ్రం చేసి శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది . రోగ నిరోధక శక్తిని పెంచి జీవక్రియలను ఉత్తేజితం చేస్తుంది . మునగ ఆకులో ఉండే పోషకాలు , యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి . రక్తంలో చక్కెర , కొవ్వులను నియంత్రించి గుండె పనితీరు మెరుగుపరుస్తుంది . కాలేయం , మెదడు ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది . నిమ్మ జాతి పండ్ల కంటే మునగాకులో విటమిన్ సి ఏడు రెట్లు అధికంగా ఉంటుంది . పొటాషియం అరటి పళ్లలో కంటే 15 రెట్లు ఎక్కువగా ఈ ఆకులో ఉంటాయి . ప్రొటీన్లు , విటమిన్ ఎ , కాల్షియం కూడా మునగాకుల్లో విరివిగా లభిస్తాయి .

• రక్తపోటును నియంత్రించి , ఆస్టియోపోరోసిస్ , ఆర్థరైటిస్ , గౌట్స్ లాంటి వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది . అంతే కాదు చర్మంలోని మృత కణాలను తొలగించి మృదువుగా చేస్తుంది . రోగ నిరోధక శక్తిని పెంచుతుంది . హార్మోన్ల సమతౌల్యతను కాపాడి , కండరాల వాపు తగ్గించి , మంచి కొవ్వును అందిస్తుంది . అలెర్జీ , ఆస్తమా , శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది . కేన్సర్ కణాలతో పోరాడి ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార , అండాశయ కేన్సర్లను నిరోధిస్తుంది . మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది . శరీరంలో నీటి సాంద్రతను సమతాస్థితిలో ఉంచుతుంది . ఇందులో ఉండే కాల్షియంతో ఎముకలు బలంగా తయారవుతాయి . బాలింతలు తీసుకుంటే తల్లిపాలు పిల్లలకు పుష్కలంగా అందుతాయి . థైరాయిడ్ సమస్యలను కూడా నివారిస్తుంది . థైరాయిడ్ హార్మోన్ చర్యలను అదుపులో ఉంచుతుంది . దీనిలో అధిక మొత్తంలో ఉండే ప్రొటీన్లు , పీచుపదార్థాలు , క్యాల్షియం , తక్కువ పరిమాణంలో కొవ్వు శరీరానికి సహజమైన శక్తిని అందిస్తాయి . శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలోమునగాకు రసం సాయపడుతుంది . దీని వల్ల లివర్ పనితీరు సక్రమంగా ఉంటుంది . .

రేచీకటి , కంటి సమస్యలు ఉన్నవాళ్లు క్యారెట్ ఎక్కువగా తింటూ ఉంటారు . దీనితోపాటు మునగాకు రసంలో కొంచెం తేనె వేసుకొని బాగా కలుపుకోవాలి . ప్రతిరోజూ పడుకునే ముందు ఈ రసాన్ని తాగితే రేచీకటి తగ్గడంతోపాటు , జ్ఞాపకశక్తి పెరగుతుంది . • మునగ పువ్వులను సేకరించి వాటి రసం తీసుకోవాలి . ఒక స్పూన్ మునగ పువ్వు రసంలో గ్లాస్ మజ్జిగ కలిపి తాగాలి . ఈ ఔషధాన్ని తరచూ తాగడం వల్ల అజీర్తి , ఉబ్బసం నుంచి ఉపశమనాన్నిస్తుంది . • మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు మునగాకు రసంలో కొద్దిగ లేత కొబ్బరి నీరు పోసి కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది .