కోదండరామ్ ను ఓడించడానికి జరుగుతున్న కుట్రలు తిప్పి కొడదాం

712

ఆచార్య  కోదండరామ్ సార్ ని ఓడించడానికి జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను తిప్పి కొడదాం: అపర మేధావి మలిదశ తెలంగాణ ఉద్యమ దిక్సూచి దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి అడుగు జాడలలో,వారి ఆలోచన విధానాలతోముందుకు సాగుతున్న కోదండరామ్ సార్ కు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రులందరూ పట్టం కట్టవలసిన సమయం ఆసన్నమైంది. నీళ్లు, నిధులు,నియామకాలు అనే నినాదం మీద జరిగిన మహోన్నత ఉద్యమం లో సకలజనులను సబ్బండ వర్గాలను ఎకతాటి మీదకు తీసుకురావడంలో తనదైన చాణక్య నీతిని  ప్రదర్శించి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమానికి సరికొత్త నిర్వచనాన్నిచ్ఛిన కోదండరామ్ సార్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.

సకలజనుల సమ్మె,RTC సమ్మె, మిలియన్ మార్చు, పెన్ డౌన్, వంటి వివిధ ఉద్యమ కార్యచరణ కార్యక్రమాలు నిర్వహించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమ రథ సారథి మన కోదండరామ్ సార్ తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత ఎన్నో పదవులను అదికార, ప్రతిపక్ష పార్టీ లు ఇవ్వజూపిన వాటిని అన్నింటిని సున్నితంగా తిరస్కరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసెందుకు తెలంగాణ జన సమితి పార్టీ ని స్థాపించారు. నేడు మనం సాధించుకున్న తెలంగాణలో రైతు,చేనేత,నిరుద్యోగ యువత ఆత్మహత్య లు జరుగుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి మోసం చేసిన అదికార పార్టీకి నిరుద్యోగ యువత, ఉద్యోగవర్గాలు, మేధావులు ఈ MLC ఎన్నికలలో ఖచ్ఛితమైన సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఎన్నికైనా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు తన స్వంత పనులు చక్కదిద్దుకోవడంలో చూపిన శ్రద్ద ( ప్రైవేట్ యూనివర్సిటీ సాదించడం, కార్పోరేట్ కాలెజీలను ప్రోత్సహించడం ) లో  సఫలీకృతం అయినారు. ప్రభుత్వ విశ్వ విధ్యాలయాలను నిర్వీర్యం చేసే కుట్రలో బాగంగానే ప్రైవేట్ విశ్వ విధ్యాలయాలను ఏర్పాటు చేసిన అదికార పార్టీని ఓడిద్ధాం. మనందరము కూడా ఈ MLC ఎన్నికలలో కోదండరామ్ సార్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలపిద్దాం. కోదండరామ్ సార్ గెలుపు ప్రతి తెలంగాణ పట్టభద్రుడి గెలుపు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు రచించిన కోదండరామ్ సార్ గెలుపును అడ్డుకోవడం అసాద్యం,అంతిమ విజయం తెలంగాణ ఉద్యమవర్గాలదే.

                                                                   – చెన్న శ్రీకాంత్ (పరిశోదక విధ్యార్థి)
ఉస్మానియా విశ్వవిద్యాలయం