స్వామీజీలను దూషిస్తే..చంద్రబాబుకు పతనమే

0
314

బ్రాహ్మణ పురోహిత సంఘాలు హెచ్చరిక..

హిందు ధర్మానికి కట్టుబడి హైందవ ధర్మ పరిరక్షణ లో కీలక పాత్ర పోషిస్తున్న స్వామీజీ లను   దూషిస్తే ఎవరికైనా పతనం తప్పదని బ్రహ్మ జ్ఞానులైన స్వామిజీలపై అనవసరమైన, వివాదాస్పద మైన ప్రేలాపనలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులు హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు స్వామీజీల విమర్షించడంపై తీవ్రంగా స్పందించారు. రాజకీయ మనుగడ కోల్పోయి మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని అటువంటి వారికి వేదవిజ్ఞులైన ,స్వామీజీ,బ్రాహ్మణుల తలుచుకొంటే పుట్టగతులు ఉండవని వారి ఆగ్రహానికి గురికావద్దని ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య  గౌరవ అధ్యక్షుడు యామిజాల నరసింహా మూర్తి  హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాలయాలు కూల్చి హిందువుల మనోభావాలను దెబ్బతీసారని దాని పర్యవసానంగా రాజకీయ భవిష్యత్ కోల్పోయిన పరిస్థితి నెలకొందని గుర్తుచేశారు. కూల్చిన దేవాలయాల స్థానంలో ప్రభుత్వ సొమ్ముతో ఆలయాల నిర్మాణం  ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని అదిచూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని. అంతర్వేది లో రథం దగ్దం అయితే ప్రభుత్వమే చొరవచూపి అనుకొన్న సమయాన్ని కంటే ముందుగా రథం సిద్ధంచేసి మాట నిలబెట్టుకుందని గుర్తిచేసారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వామిజీలపైన, బ్రహ్మణులపై అపారమైన భక్తి, నమ్మకం ఉందని అందుకే ఎవరికి అందనంత స్థాయిలో ఉన్నారని . ధర్మం ఎటువైపు ఉంటే స్వామిజీలు ,బ్రాహ్మణులు అటువైపు ఉంటారని ధర్మాన్ని కాపాడే వారిని అనవసరంగా దూషిస్తే బతికిఉండగానే కర్మకాండ లు చేస్తారని హెచ్చరించారు.60 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు   14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మీరు ఎప్పుడైనా ఏ పీఠాన్నైనా సందర్శించారా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం, కంచి, శృంగేరి, పుష్పగిరి పీఠాలు మఠాలుకి సంభందించిన భూములు మీరు ముఖ్యమంత్రి గా ఉండగా కబ్జాలు చేసింది నిజం కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం.అర్చకులు భూములు, దేవాలయం భూములు కొన్ని వేల ఎకరాలు మీ హయాంలో కబ్జాలకు గురి కాలేదా అని మేం ప్రశ్నిస్తున్నాం అన్నారు.

అర్చకులు జీవితాలతో మీ ప్రభుత్వం ఆటలాడుకుంది, అదే ఇప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అర్చకులకు బాసటగా నిలిచింది అని గుర్తుచేస్తున్నాం. పుస్కరాలో వందలాదిమంది మీ కారణంగా చనిపోతే ఆ పాపం మీకు సహమైంది అని కనీసం ఆలోచించకుండా ఇప్పుడు స్వామీజీ లను దూషిస్తే ఇక మీ భవిష్యత్తు ఏమౌతుందో ఒక్కసారి ఆలోచించుకోమని చంద్రబాబు కి సూచన చేస్తున్నాం  అన్నారు.

గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు, వారికి కూడా చట్టసభలు లో స్థానం కలగాలంటే తెలుగుదేశం తరుపున వారికి కూడా సీట్లు ఇద్దాం అనే ఇంగితజ్ఞానం లేని నువ్వు ముఖ్యమంత్రి గా ఇక పనికి రావు అని నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టి నీకున్న స్థానం చెప్పినా… తగుదునమ్మ అని నీ రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు ని దూషిస్తే ఇక నీకు మరణ శాసనమే. నీ చేతులతో రాసుకుంటున్నావు. హిందూ ధర్మం కాపాడుతూ ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాజగురువు స్థానం పొందారు అంటే శారదా పీఠాధిపతులు ధార్మిక భావాన్ని గ్రహించలేని నీకు స్వామీజీ ల ప్రస్తావన తెచ్చే అర్హత లేదు అని అని స్పష్టం చేశారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖా లో ధార్మిక పరిషత్ ని మూయించిన ఘన చరిత్ర కలిగిన నువ్వు హిందువువేనా అని ప్రశ్నిస్తున్నాం.  ఇకముందు ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని, భవిష్యత్ లో శారదా పీఠాధిపతులు ని దూషిస్తే యావత్ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యం ఏకమై ఆ భగవంతుడు వేదపురుషుడు మాకు అందించిన సకల వేదాలను అనుసరించి నీకు రాజకీయ భవిష్యత్ మాత్రమే కాకుండా నీకు జీవిత భవిష్యత్ కూడా లేకుండా చేస్తామని హెచ్చరించారు.  నీ నీచ రాజకీయ ప్రయోజనాల కొరకు హిందూ మతాన్ని ఎలా అడ్డంగా వాడుకుంటున్నావో ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలియచేయటానికి త్వరలోనే ధర్మ ప్రచార యాత్ర చేసి నీ భాగోతం బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.