హిమాలయాలు-మోడీ రెండూ ఒకటే!

232

(పార్ధసారధి పోట్లూరి )

పెట్రోల్ ధరలు తగ్గడం లేదు. నిజమే. లాడఖ్ వద్ద చైనా దుందుడుకు వల్ల మన దేశం సుమారు 50 వేల మంది సైనికులను, చాలా యుద్ధ ట్యాంకులను, యుద్ధ విమానాలను, హెలికాఫ్టర్స్ ని తరలించవలసి వచ్చింది. అంతేకాక ఇన్ని నెలలూ అంటే సుమారు 9 నెలలు ఇవి అక్కడ నిర్వహించవలసి వచ్చింది. మిలిటరీ అధికారుల అంచనా ప్రకారం  వీటి నిర్వహణ ఖర్చు తక్కువలో చూసుకుంటే రోజుకి ₹100 కోట్ల నుండి ₹150 కోట్లు అవుతుందట. అంటే కేంద్రానికి ఎంత అదనపు ఖర్చో చూడండి.

చైనా దళాల ఉపసంహరణ : చైనా ఆబ్జెక్టివ్స్ ఒక విశ్లేషణ.
చైనా తన భారత్ సరిహద్దుల వైపు [LAC]  ఇన్ఫ్రాస్ట్రాక్చర్ ని అభివృద్ధి చేసింది 2013 వరకు.    భారత దేశ సరిహద్దుల వెంబడి యుద్ధ సామాగ్రి అంటే హెవీ లోడ్ లు తీసుకెళ్లగలిగే విధంగా రోడ్లు నిర్మించింది.  మధ్యలో అవసరం అయిన చోట సొరంగ మార్గాలు నిర్మించింది భవిష్యత్తులో ఎలాంటి అవరోధాలు కలగకుండా.

ఒకరకంగా చెప్పాలంటే తన మాటకి ఎదురుచెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్న 10 ఏళ్ల లో వీటిని నిర్మించింది. మన సరిహద్దుల్లో చైనా మంచి రోడ్లు వేస్తున్న విషయాన్ని గతంలో ఏ మీడియా సంస్థ కూడా చెప్పలేదు. అది వాళ్ళ భూభాగంలో నిర్మిస్తున్నారు అనే సాకు ఉంది. నిజానికి కాంగ్రెస్ పాలనలో ఉన్న 10 సంవత్సరాలు చైనా కొన్ని చోట్ల చెక్ పోస్టలు,మరికొన్ని చోట్ల వాచ్ టవర్లు నిర్మించింది. చైనా ఉద్దేశ్యం ఏమిటంటే భవిష్యత్తులో భారత్ మీద దాడి చేసి వేగంగా భూభాగాలు ఆక్రమించుకోవాలి అని. అలాగే భారత్ వైపు కనుక రోడ్లు వేస్తుంటే అడ్డుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది ఎందుకంటే అప్పటికే తన వైపు వేగంగా రవాణా చేయడానికి కావలసినంత ఇన్ఫ్రా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి పని చాలా తేలికగా అయిపోతుంది.  ఇది మొదటి టార్గెట్.

కానీ 2014 లో బిజేపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సరిహద్దుల వెంబడి రోడ్లు,సొరంగాల పనిని వేగవంతం [అప్పటికే ప్రారంభించి ఆపేసిన ] చేసింది. కొత్తవి ప్రారంభించింది గత 6 ఏళ్లలో. ఇప్పుడు చేస్తున్న పనులని బట్టి 2022 లోపు అన్నీ ప్రాజెక్టులు పూర్తి చేస్తుంది BRO. 2020 వేసవి కాలం వృధా అయిపోయింది కోవిడ్ వల్ల, మరియు లడాక్ దగ్గర ఉద్రిక్తితల వల్ల,   కూలీలు దొరకపోవడం [ గత వేసవి పనుల కోసం జార్ఖండ్ ప్రభుత్వం కూలీలని పంపడానికి నిరాకరించింది ] ఇంకో కారణం. కేవలం మార్చ్ నెల నుండి అక్టోబర్ నెల వరకే ఏదయినా నిర్మాణ పనులు నడుస్తాయి లడాక్ ప్రాంతంలో తరువాత మంచు వల్ల రోడ్లు మూసివేస్తారు.

ఇప్పుడు 2021, 2022 ల మధ్య రెండు వేసవి కాలాలు ఉన్నాయి. ఈ వేసవి కాలాల్లో మిగతా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. చైనా ప్లాన్ ఈ వేసవి కాలాల పనులని అడ్డుకోవాలి కాబట్టి ఒకటికి నాలుగు చోట్ల ఉద్రిక్త పరిస్తితులు ఏర్పరిస్తే సైన్యం దృష్టి  [ప్రభుత్వ ]  మరల్చవచ్చు పైగా ఇలాంటి వాటి మీద తన మిత్ర పక్షం కాంగ్రెస్ ఆందోళన లేవదీస్తుంది తనకి మద్దతుగా. పరోక్షంగా కాంగ్రేస్ కి కూడా రాజకీయ మైలేజ్ వస్తుంది. ఫలితంగా తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలంటే రోడ్ల నిర్మాణం ఆపమని బేరమాడవచ్చు. కానీ తన మొదటి ఆబ్జెక్టివ్ సక్సెస్ కాలేదు.

మావో ఆలోచన ఎలా ఉంటుందో అలాగే జింగ్ పింగ్ ఆలోచన కూడా సేమ్ టూ సేమ్.  మావో తరువాత అంతలా నీయంతృత్వంగా వ్యవహరిస్తున్నది జిన్ పింగ్ మాత్రమే. 1962 లో మావో నెహ్రూ కి ,భారత్ కి గుణ పాఠం నేర్పాలి అనేవాడు , అనడమే కాదు నేరుగా దాడి చేసి భారత్ లోని ప్రాంతాలని ఆక్రమించుకున్నాడు. తరువాతి కాలంలో వియత్నాం కి గుణ పాఠం నేర్పాలని దాడి చేసి భంగ పడ్డది చైనా. ఒక అంగుళం భూమి కూడా ఇవ్వలేదు వియత్నాం చైనాకి కానీ భారత్ మాత్రం ఏకంగా 42 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం కోల్పోయింది నెహ్రూ మూలంగా.

ఇప్పుడు మావో స్థానంలో అలానే ఆలోచించే జింగ్ పింగ్ ఉన్నాడు. మోడీ కి [భారత్ ] గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకొని మరీ నాలుగు చోట్ల చొరబాటుకి తెగబడ్డాడు. తనకి అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు స్వేచ్ఛగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో అలాగే తాను 1962 లో ఆక్రమించుకున్న ఆక్సయి చిన్ ప్రాంతంలో యదేచ్చగా రోడ్ల నిర్మాణం చేసింది చైనా.  రెండు సార్లు పూర్తి మెజారిటీ తో మోడీ గెలవడం జింగ్ పింగ్ కి మింగుడు పడలేదు. గత ఎన్నికల్లో 7 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోగా మోడీ మళ్ళీ గెలవడం పుండు మీద కారం చల్లినట్లయింది జింగ్ పింగ్ కి. పైగా ఆసియాలో అత్యంత పలుకుబడి గల నేత గా మోడీ ఎదగడం జింగ్ పింగ్ కి మింగుడుపడలేదు. ఆసియాలో నే కాదు మొత్తం ప్రపంచంలో నే ప్రభావవంత నాయకుడిగా మోడీ అవతరించడం చైనాకి , జింగ్ పింగ్ కి అస్సలు ఇష్టం లేదు.

కరోనా విస్తరిస్తున్న మొదటి దశలో ప్రపంచం మొత్తం దృష్టి భారత్ వైపే ఉంది ఎందుకంటే 130 కోట్ల జనాభాతో ఉన్న భారత్ లో కరోనా వల్ల కోట్లలో మరణాలు ఉంటాయని అంచనా వేశాయి అటు యూరోపు దేశాలతో పాటు వెస్ట్రన్ మీడియా కూడా.    చైనా కూడా ఇదే ఉద్దేశ్యంతో చొరబాట్లకి సాహసించింది ఒకవైపు కరోనా తో విల విలలాడుతుంటే సరిహద్దుల్లో వేడి రగిల్చి బేరం ఆడాలని ఉద్దేశ్యం. కానీ అలా జరగలేదు.

అమెరికా, యూరోపుల జనాభా నిష్పత్తి తో పోలిస్తే అక్కడ జరిగిన మరణాల తో పోలిస్తే భారత్ లో మరణాల సంఖ్య చాలా తక్కువ. ఇది జింగ్ పింగ్ కి అస్సలు మింగుడు పడలేదు సరి కదా అత్యంత ప్రభావ శీలంగా కరోనాని కట్టడి చేసిన దేశంగా భారత్ కి ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చింది. చైనాకి వైరస్ ని వ్యాప్తి చేసిన దేశంగా చెడ్డ పేరుని తెచ్చింది. చైనా రెండో ఆబ్జెక్టివ్ కూడా నెరవేరలేదు సరికదా తన వాక్సిన్ కంటే భారత్ లో తయారయ్యే వాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూడడం అనేది మింగుపడలేదు. బ్రెజిల్ కి సినోవాక్సిన్ తయారు చేయడానికి లైసెన్స్ ఇచ్చినా దానిని పక్కన పెట్టి మరీ భారత్ నుండి దిగుమతి చేసుకోవడం అంతర్జాతీయంగా చైనా విశ్వసనీయత కోల్పోవడానికి దోహదం చేసింది. మోడీ చాలా నిగర్వంగా,నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు తప్పితే ఎక్కడా నోరు జారలేదు. పైగా చైనా సైన్యానికి ఎదురు జవాబు చెప్పడానికి ఎన్ని నెలలు లేదా సంవత్సరాలయినా సిద్ధంగా ఉంటాను అని నిశ్శబ్దంగా జవాబు చెప్పాడు.

ఒకవైపు లదాక్ లో తన సైన్యాని మోహరిస్తే మోడీ అక్కడ జవాబు ఇస్తూనే హిందూ మహాసముద్రం లో మన నావికా దళాన్ని మొహరించడం పైగా క్వాడ్ పేరుతో అమెరికా , ఆస్ట్రేలియా,జపాన్ లతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి జాయింట్ గా నావికా విన్యాసాలు చేయడం ఒక ఎత్తయితే అటు అమెరికా , ఆస్ట్రేలియా లతో పాటు జపాన్ దేశాల యుద్ధ నౌకలు భారత్ రేవులలో ఇంధనం నింపుకోవడం తో పాటు అత్యవసరంగా రిపేర్లు చేయించుకోవడానికి ఒప్పంద చేసుకున్నాడు మోడీ. ఇదేమీ చిన్న విషయం కాదు. ఒకవేళ పసిఫిక్ ,హిందూ మహాసముద్రాల మీద యుద్ధం అంటూ వస్తే [అమెరికా తో లేదా జపాన్ లతో ] భారత్ కూడా వాళ్ళతో చేతులు కలుపుతుంది అనే భయం చైనాకి కల్పించాడు మోడీ.

అసలు ఇండియన్ ఓషన్ లేదా హిందూ మహా సముద్రం కి ఆ పేరు పెట్టడం చైనాకి ఇష్టం లేదు. హిందూ లేదా ఇండియన్ అనే పేరు ఎందుకు పెట్టాలి అనేది చైనాని వేధిస్తున్న సమస్య డానికితోడు అమెరికా తరుచూ ఇండో – పసిఫిక్ అనే పదం వాడుతున్నది అంటే ఇటు హిందూ మహా సముద్రం తో పాటు పసిఫిక్ మహా సముద్రం [సౌత్ చైనా సముద్రం పసిఫిక్ రీజియన్ లో ఉంది ] రెండింటినీ కలిపి ఒకే సమస్యగా ఎత్తి చూపుతున్నది అమెరికా. నిజానికి నాలుగు శక్తివంతమయిన దేశాలని ఒకే సారి ఎదుర్కోవడం అంత తేలిక కాదు చైనాకి. ఏ మాత్రం దుస్సాహసం చేసినా చైనా తన భూభాగలని కోల్పోవాల్సి వస్తుంది ఈ విషయం చైనాకి కూడా తెలుసు పైగా తన నేవీ సామర్ధ్యం ఎలాంటిదో ఇంతవరకు ఏ యుద్ధం చేయలేదు కనుక తనకి కూడా అనుమానాలు ఉన్నాయి. అన్నింటికీ మించి భాష సమస్య ఒకటి ఉండనే ఉంది అది ఇంగ్లీషు. భారత్ ,అమెరికా, ఆస్ట్రేలియాలు ఇంగ్లీష్ భాష ని బాగా వాడగలవు కానీ యుద్ధ సమయంలో వైర్లెస్ సంభాషణాలని ట్రాప్ చేసినా వాటిని అర్ధం చేసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రష్యా ఈ విషయంలో తటస్థంగా ఉండిపోతుంది అది చినాకి కూడా తెలుసు. మోడీ దౌత్యం ఎలా ఉంటుందో చైనాకి తెలిసివచ్చింది.

చైనాకి దిగుమతి అయ్యే ఆయిల్ సరఫరా మొత్తం మలక్కా జలసంధి [Malacca Strait ] హిందూ మహా సముద్రం ద్వారానే జరుగుతుంది దీనిని భారత్ ఒంటరిగా ఆపగలదు. లాడాఖ్ దగ్గర ఉద్రిక్తిత ఉంటే భారత్ హిందూ మహా సముద్రం మీద దృష్టీ పెట్టలేదు అని చైనా ఊహ కానీ అలా జరగలేదు దేనికదే అన్నట్లుగా ద్విముఖ వ్యూహం తో పోయాడు మోడీ. ఇదీ పారలేదు.

లాడాక్ దుస్సాహసం తరువాత వియాత్నాం ,ఫీలలిప్పైన్స్ లాంటి చిన్న దేశాలతో పాటు అటు జపాన్ కూడా భయపడుతుంది అని చైనా ప్లాన్. కానీ అలా జరగలేదు సరికదా ఇప్పుడు వియాత్నాం తో పాటు ఫిలిప్పైన్స్ కూడా చైనాకి భయపడే పరిస్థితి లేదు. భారత్ ఇచ్చిన ధీటయిన జవాబు తో చిన్న దేశాలు కూడా చైనాకి భయపడే పరిస్థితి లేదు. ఒక పక్క లాడాక్ లో మనతో ఘర్షణ కి దిగిన సమయంలోనే ఇంకో పక్క పసిఫిక్ సముద్రంలో ఉన్న జపాన్ కి చెందిన ‘సేన్ కాకు ‘ దీవుల దగ్గరికి తన యుద్ధ నౌకలని నడిపింది చైనా మూడు నెలల క్రితం.   జపాన్ కూడా తీవ్రంగానే స్పందించింది దీనిమీద.ఒక సందర్భంలో యుద్ధ మేఘాలు కూడా అలుముకున్నాయి కానీ అదే సమయంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న అమెరికా కారియర్ బాటిల్ గ్రూపు జపాన్ కి మద్దతుగా కదలడం తో చైనా వెనక్కి తగ్గింది. So ! ఒకేసారి ఇటు భారత్ తో లాడాక్ దగ్గర ఆక్రమణ కి ప్రయత్నించి ఇంకో వైపు జపాన్ కి చెందిన సేనకాకు దీవులని ఆక్రమించుకోవాలి అనుకున్న చైనా ప్లాన్ రెండు చోట్లా బెడిసి కొట్టింది.

అప్పట్లో జపాన్ కి మద్దతుగా భారత్ తో పాటు ఆస్ట్రేలియా కూడా తమ యుద్ధ నౌకలని పంపడానికి సిద్ధం అయినట్లు వార్తలు వచ్చాయి కానీ చైనా వెనక్కి తగ్గడంతో అక్కడితో ముగిసిపోయింది. భారత్ తమ యుద్ధ నౌకలని పంపుతుంది అనేదే చైనాకి మింగుడు పడలేదు. అంటే లాడాక్ స్టాండ్ ఆఫ్ అక్కడ అలానే ఉంటుంది కానీ ఇటు హిందూ మహా సముద్రంలో కానే అటు పసిఫిక్ మహా సముద్రంలో కానీ చైనాకి వ్యతిరేకంగా భారత్ తన యుద్ధ నౌకల్ని పంపించడానికి సిద్ధ పడడం అనేది చైనా ప్లాన్ కి విరుద్ధంగా జరిగినది.

మరో ముఖ్యమయిన విషయం ఏమిటంటే గత వేసవిలో గాల్వాన్ నది ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు గాల్వాన్ నది ప్రవాహాన్ని మళ్లించడానికి చైనా ప్రయత్నాలు చేసింది అయితే చైనా ప్రయత్నాలని మన సైన్యం అడ్డుకుంది. దానినే ఇప్పుడు మన సైనికులు చైనా భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు అంటూ అక్కడి స్థావరాలని ఖాళీ చేసిన తరువాత అప్పటి వీడియొ లని  మీడియాకి లీక్ చేసింది చైనా చాల తెలివిగా.

ఫిబ్రవరి నెల చలి చాలా పీక్ లో ఉంటుంది లాడాక్ దగ్గర. మన సైన్యానికి అలవాటే కానీ చైనా సైన్యానికి అంత చలిని తట్టుకోవడం సాధ్యం కావట్లేదు పైగా మనతో పాటు ఖర్చు వాళ్ళకి కూడా ఉంటుంది. ఎటూ వాక్సిన్ వచ్చేసింది కాబట్టి అక్కడ తిష్ట వేయడం కంటే వెనక్కి వెళ్లిపోవడమే బెటర్ అనుకుంది చైనా. ఇంతా చేస్తే తన ఆబ్జెక్టివ్స్ ఏవీ కూడా నెరవేరలేదు సరి కదా చావు తప్పి కన్ను లొట్ట పోయింది అన్నట్లుగా తయారయింది చైనా పరిస్థితి.

ఇంతకీ లాడాక్ సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం ఆగిపోయిందా? దేని దారి దానిదే ! మరో నెల అంటే మార్చ్ నెల నుండి అన్నీ మొదలవుతాయి 2022 కి మొత్తం ప్రాజెక్ట్స్ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగిపోతాయి. 2022 తరువాత అన్నీ రోడ్ల నిర్మాణం అయిపోయాక మన సైన్యం కూడా నిత్యం పహరా కాస్తుంది వీలుంటే అక్సాయ్ చిన్ ని కూడా స్వాధీనం చేసుకుంటుంది.

హిమాలయాలు-మోడీ రెండూ ఒకటే !
చైనా ముందు ముందు మన దేశంలో నకిలీ ఉద్యమాలు ఇంకా మొదలు పెడుతుంది తన బానిసల ద్వారా. టార్గెట్ 2023 లోక్ సభ ఎన్నికలు – మోడీ గెలవకూడదు !
ఇప్చ్ ! హిమాలయాలకి మొక్కాలి… ఎదురు వెళ్లకూడదు.