గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కారుణ్య నియామకాలు

142

గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి.జాని పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫెడరేషన్ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి,రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వారికి మరియు సంభందిత శాఖ కార్యదర్శి వారికి సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందించడం జరిగిందని,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జె.ఎ.సి చైర్మన్ యన్.చంద్రశేఖర్ రెడ్డి చీఫ్ సెక్రటరీతో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో సచివాలయ ఉద్యోగుల సమస్యల గురించి చర్చించగా తప్పనిసరిగా ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇటీవల సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధిపతులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో  ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు పరిష్కారం కోసం తాము సమర్పించిన వినతులకు పరిస్కారం చూపుతూ ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం మే నెల 31వ తేదీలోపు పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని,కారుణ్య నియామకాలకు అంగీకారం తెలిపారని,అందరికీ సర్వీస్ రిజిస్టర్ ల ప్రారంభించాలని కోరగా మార్చ్ 31వ తేదీ లోపు ప్రతి ఒక్కరికి సర్వీస్ రిజిస్టర్లు ప్రారంభించాలని ఆదేశాలు జారిచేశారని,అలాగే జాబ్ చార్ట్ అమలు గురించి కూడా త్వరలో సరైన మార్గ దర్శకాలు విడుదల చేస్తామని తెలియజేస్తూ సచివాలయాల శాఖ తరపున ప్రకటన విడుదల చెయడం శుభపరిణామమని,తమ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి మరియు ప్రభుత్వానికి ఫెడరేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఎల్లప్పుడూ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధుల్లా వుంటూ న్యాయమైన సమస్యలు పరిష్కరించేదుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని వెంటనే స్పందించిన ముఖ్యమంత్రికి ఋణపడి ఉంటామని ఎం.డి.జాని పాషా తెలిపారు.