దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరుగుతున్న గల్ఫ్ పుడ్ 2021 సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. పిబ్రవరి 21 నుంచి 25 వరకు జరగనున్న ఈ గల్ఫ్ పుడ్ సదస్సులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి పూనం మాలకొండయ్య నేతృత్వంలో ఏపీ వ్యవసాయ అధికారుల బృందం పాల్గొంది.
ఈ సదస్సులో ఇవాళ జరిగిన లైవ్ ఇన్ పర్సన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో ఆహారశుద్ధి రంగానికి ఉన్న అవకాశాలను మరియు ప్రభుత్వం వ్యవసాయ దాని అనుబంధ రంగాలకు ఇస్తున్న ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఏపీ పుడ్ ప్రాససింగ్ సోసైటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారశుద్ధి రంగాన్ని వివరిస్తూ ఒక స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆ స్టాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వనరులు, పంట ఉత్పత్తలు, పెట్టుబడిదారులకు ఉన్న అవకాశాలను వివరించడంతో పాటు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నెలకొల్పబోయే సెకండరీ పుడ్ ప్రాససింగ్ పరిశ్రమలు గురించి కూడా ప్రదర్శించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతున్న పుడ్ ప్రొడక్ట్స్‌ను స్టాల్స్‌లో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి పూనం మాలకొండయ్యతో పాటు ఏపీ పుడ్ ప్రాససింగ్ సొసైటీ సీఈఓ యల్ శ్రీధర్ రెడ్డి, ఏపీ పుడ్ ప్రాససింగ్ సొసైటీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా.పద్మావతి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.