జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పన్నులు పెంచే ప్రసక్తే లేదు

182

జలీల్ ఖాన్ ఒక స్క్రాబ్..ఆ స్క్రాబ్ గురించి మాట్లాడుకోవడం అనవసరం
దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

టిడిపి నేతలు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి..లేనిపోని ఆరోపణలు చేస్తే‌సహించేది లేద‌ని, నాపైన విమర్శలు చేయడానికి ఏమీ లేవు కాబట్టే పన్నులు పెంచుతారు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు.

శ‌నివారం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా  47వ డివిజనులో చిట్టిన‌గ‌ర్ అమ్మవారి గుడి ఎద‌రు సందు కర్మెల్ చర్చి వద్ద నుంచి మంత్రి వెలంప‌ల్లి త‌న ప‌ర్య‌ట‌న ప్రారంభించారు. స్థానికుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.  కొంద‌రు కావాల‌నే అసత్యల‌ను  ప్రచారాలు చేస్తున్నార‌ని,జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పన్నులు పెంచే ప్రసక్తే లేదని అని సృష్టం చేశారు. గత టిడిపి హయాంలో బెజవాడలో ప్రజా‌ సమస్యలను విస్మరించారన్నారు.  ప్రచారాలకు మా అభ్యర్ధులు వెలుతుంటే బ్రహ్మరధం పడుతున్నారు. టిడిపి వాళ్లు వెలితే తిడుతున్నారు. విజయవాడతో పాటు పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. జలీల్ ఖాన్ ఒక స్క్రాబ్..ఆ స్క్రాబ్ గురించి మాట్లాడుకోవడం అనవసరం అన్నారు.